విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము

ABN, Publish Date - Oct 16 , 2026 | 07:37 AM

విజయవాడలో జాతీయ సరస్ మేళా-2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ముందుగా సరస్ మేళా ప్రాంగణం వద్ద రాష్ట్రపతికి గవర్నర్, సీఎం, కేంద్రమంత్రులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన డ్వాక్రా మహిళలతో రాష్ట్రపతి, సీఎం గ్రూప్ ఫొటో దిగారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి, సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము 1/20

విజయవాడలో జాతీయ సరస్ మేళా-2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము 2/20

ముందుగా సరస్ మేళా ప్రాంగణం వద్ద రాష్ట్రపతికి గవర్నర్, సీఎం, కేంద్రమంత్రులు స్వాగతం పలికారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము 3/20

ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన డ్వాక్రా మహిళలతో రాష్ట్రపతి, సీఎం గ్రూప్ ఫొటో దిగారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము 4/20

కార్యక్రమానికి ముందు మేళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె పరిశీలించారు. పలువురు మహిళా వ్యాపారవేత్తలతో రాష్ట్రపతి మాట్లాడారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము 5/20

ఓ స్టాల్‌ నుంచి రూ.4,500 ఖరీదైన దుప్పట్లను రాష్ట్రపతి ముర్ము కొనుగోలు చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాలులర్పించారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము 6/20

ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. దేశంలోని మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము 7/20

దేశంలోని అనేక మంది మహిళలు నేడు రూ.2 లక్షలకు మించి ఆదాయం పొందుతున్నారని రాష్ట్రపతి ముర్ము అన్నారు. మహిళల ఆర్థిక భాగస్వామ్యం పెరగడం దేశ అభివృద్ధిలో కీలకమని చెప్పారు. దేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే ఉన్నారని తెలిపారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము 8/20

సరస్‌ మేళా నిర్వహణను మహిళల అభివృద్ధికి ముఖ్యమైన ముందడుగుగా రాష్ట్రపతి ముర్ము అభివర్ణించారు. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాల్లో ఇలాంటి మేళాలు జరగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము 9/20

మహిళలు స్వయం శక్తితో ఎదగడానికి ఆర్థికంగా స్వతంత్రులుగా మారడానికి ప్రేరణ కల్పిస్తాయని రాష్ట్రపతి ముర్ము వెల్లడించారు. దేశంలోని వైవిధ్యభరితమైన ఉత్పత్తులను ఒకే ప్రాంగణంలో ప్రదర్శించడానికి, వాటి ద్వారా ఆదాయం పొందేందుకు ఇలాంటి మేళాలు ఉపయోగపడతాయని వివరించారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము 10/20

గతంలో మహిళలు చిన్నచిన్న అవసరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉండేవని రాష్ట్రపతి ముర్ము తెలిపారు. ప్రస్తుతం మహిళలు స్వతంత్రులుగా మారుతూ, తమ కుటుంబాలకు అండగా నిలవడమే కాకుండా, ఇతరులకూ సహాయంచేసే స్థాయికి ఎదుగుతున్నారని ఉద్ఘాటించారు. మహిళల ఆదాయం వారి కుటుంబాలకే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము 11/20

తనది ఆంధ్రప్రదేశ్‌ పక్క రాష్ట్రమే అయినప్పటికీ తెలుగు నేర్చుకోలేక పోయానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినపుడు తెలుగు నేర్చుకుని, తెలుగులోనే ప్రసంగించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము 12/20

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి సంకల్పించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. మహిళా సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగితే, 2047 కంటే ముందే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదిగే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము 13/20

అలాగే, నెల్లూరు జిల్లాకు చెందిన భవాని ఎస్‌హెచ్‌జీ స్టాల్‌ను రాష్ట్రపతి ముర్ము సందర్శించి...నిర్వాహకురాలు స్వర్ణలతతో సరదాగా ముచ్చటించారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము 14/20

ఆ స్టాల్లో వాటి ధరలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యానికి మేలుచేసే ఉత్పత్తులను విక్రయిస్తున్నారంటూ స్వర్ణలతను రాష్ట్రపతి ముర్ము అభినందించారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము 15/20

ఈ స్టాల్‌లో ఆమె విక్రయిస్తున్న పచ్చళ్లు, డ్రైఫ్రూట్స్‌తో తయారు చేసిన చిరుతిళ్లు, స్వచ్ఛమైన నెయ్యి, తేనెలను రాష్ట్రపతి పరిశీలించారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము 16/20

దేశం నలుమూలల నుంచి వచ్చిన స్వయం సహాయక సంఘాల మహిళల బలం, సృజనాత్మకత, వ్యాపార నైపుణ్యం, సంకల్పానికి ప్రతీకగా సరస్‌ మేళా నిలుస్తుందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కొనియాడారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము 17/20

మహిళా శక్తిని చాటేందుకే ఈ 'సరస్ మేళా' నిర్వహిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నిన్నటి పొదుపు సంఘాలు.. నేటి వ్యాపార సంస్థలని తెలిపారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము 18/20

అవే రేపటి అంతర్జాతీయ బ్రాండ్లు కావాలని సూచించారు. ఇప్పటివరకు ఢిల్లీలోనే 'సరస్ మేళా' నిర్వహించారని.. విజయవాడలో 'సరస్ మేళా'.. ఏపీకి ప్రత్యేక శోభను తీసుకువచ్చిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము 19/20

రాష్ట్రపతి ముర్ము జీవితం ప్రతి మహిళకు స్ఫూర్తి దాయకమని ముఖ్యమంత్రి కొనియాడారు. సంకల్ప బలం ఉంటే మహిళలు ఉన్నత శిఖరాలకు చేరతారని వివరించారు. ఇది నారీ శక్తి.. నవభారత్ శక్తి.. వికసిత్ భారత్‌కు పునాది అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము 20/20

ఇది కేవలం మేళా కాదని.. 365 రోజుల మార్కెట్ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుందని వెల్లడించారు. గ్రామీణ మహిళల ఆదాయం పెంచడమే ఈ మేళా లక్ష్యమని తెలిపారు. కొత్త వ్యాపారులకు అవకాశాలు సృష్టించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Updated at - Oct 16 , 2026 | 08:33 AM