కెనడా మేయర్ రేసులో తెలుగు మహిళ
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:40 PM
తెలంగాణ సంతతికి చెందిన దీపికా దామెర్ల కెనడాలోని మిసిసౌగా మేయర్ పదవికి పోటీచేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి దీపిక వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. హిందీ పాట ‘క్యా హువా తేరా వాదా’ స్టైల్‌లో ఓటర్లకు ఆమె హామీలు ఇస్తున్నారు. ఆ పాట తరహాలో పేరడీ చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: తెలంగాణ సంతతికి చెందిన దీపికా దామెర్ల కెనడాలోని మిసిసౌగా మేయర్ పదవికి పోటీచేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి దీపిక వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. హిందీ పాట ‘క్యా హువా తేరా వాదా’ స్టైల్‌లో ఓటర్లకు ఆమె హామీలు ఇస్తున్నారు. ఆ పాట తరహాలో పేరడీ చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పాటను ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. తనను మిసిసౌగా మేయర్‌గా గెలిపిస్తే ఏమేం చేస్తానో వివరిస్తూ పలు హామీలు ఇచ్చారు. ‘‘మిసిసౌగా మేయర్ పదవికి పోటీచేస్తున్న నన్ను గెలిపించండి. నేను మేయర్‌గా ఎన్నికైతే ప్రాపర్టీ ట్యాక్స్ పెంచను. ఆ పన్ను పెరగకుండా చూస్తాను. దయచేసి నాకు మద్దతు తెలిపి మేయర్‌గా గెలిపించండి. మిసిసౌగా పనిచేసే నగరం’’ అని ఆ పోస్టులో దీపిక ట్వీట్ చేశారు. కాగా.. ఒరిజినల్ హిందీ పాటలో పదాలను మార్చిన ఆమె.. అదే ట్యూన్‌లో పాడుతూ ఒటర్లకు హామీలు ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎవరీ దీపికా దామెర్ల?
దీపికా దామెర్ల సికింద్రాబాద్‌లో జన్మించారు. తర్వాత ఆమె కుటుంబం కెనడాకు వలస వెళ్లింది. టొరంటో యూనివర్సిటీలో రోట్‌మన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఆమె ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేశారు. ఎంబీఏ పూర్తిచేసిన తర్వాత కార్పొరేట్ బ్యాంకింగ్ రంగంలో కొంతకాలం పనిచేశారు. మిసిసౌగాలోనే ఓ వ్యాపారం కూడా నడిపారు. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2018లో మిసిసౌగా సిటీ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. సిటీలోని ఏడో వార్డుకు ప్రాతినిధ్యం వహించారు. ఆ నగరంలో ఆమె దీర్ఘకాలంగా కమ్యూనిటీ లీడర్‌గానూ వ్యవహరించారు. అంతకుముందు ప్రావిన్షియల్ పార్లమెంట్ మెంబర్‌గా మిసిసౌగా ఈస్ట్ కుక్స్‌విల్లేకు ఏడేళ్లు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో ఒంటారియో వైద్య శాఖలో సహాయ మంత్రిగా పనిచేశారు. అలాగే మినిస్టర్ ఆఫ్ సీనియర్స్ అఫైర్స్‌లోనూ సేవలందించారు. వైద్య శాఖలో పనిచేస్తున్న సమయంలో మిసిసౌగా ఆసుపత్రిలో 350 కొత్త బెడ్లు, రెండు లాంగ్ టర్మ్ కేర్ హోంలు, రెండు కొత్త స్కూళ్లను ఏర్పాటు చేయించారు.
ఇవీ చదవండి:
‘ఢిల్లీని స్తంభింపజేయడం సమంజసమేనా?’.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కేరళ మాజీ సీఎం విజయన్‌కు షాక్.. ఎఫ్‌ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం