తల్లిపాలు మేలు
ABN , Publish Date - Aug 02 , 2026 | 10:19 AM
బిడ్డకు తల్లిపాలు ఇవ్వడంపై ఆధునిక యుగంలో తల్లులకు అనేక అపోహలు, సందేహాలున్నాయి.
బిడ్డకు తల్లిపాలు ఇవ్వడంపై ఆధునిక యుగంలో తల్లులకు అనేక అపోహలు, సందేహాలున్నాయి. అందుకే ఈ విషయంపై అవగాహన కల్పించడం కోసం ప్రతీ ఏడాది ఆగస్టు మొదటి వారంలో (1 నుంచి 7 దాకా) ‘ప్రపంచ తల్లిపాల వారోత్సవాల’ను నిర్వహిస్తుంటారు. ప్రతీ ఏడాది ఒక్కో థీమ్‌తో సాగే ఈ ఉత్సవాలు తల్లిపాల గొప్పదనాన్ని తెలియజేస్తాయి. ఈ సందర్భంగా కొన్ని విశేషాలు...
ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’, యునిసెఫ్ ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది ఒక థీమ్‌ను విడుదల చేస్తారు. ఈ ఏడాది థీమ్ ‘తల్లిపాలు... జీవితానికి సుస్థిరమైన ఆరంభం కోసం: సమర్థవంతమైన విధానాలను బలోపేతం చేయడం’
ఏడాది పాటు తల్లి పాలు ఇచ్చిన తర్వాత ఆపడం కష్టమనడానికి ఆధారాల్లేవు... కానీ రెండేళ్ల దాకా తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లికి, శిశువుకి ప్రయోజనమే అనడానికి ఆధారాలున్నాయి. అయితే ఎంతకాలం తల్లిపాలు ఇవ్వాలనేది వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది.
రాత్రిపూట తల్లి పాలు ఇస్తే...బేబీ హాయిగా నిద్ర పోతుంది. తల్లిపాలలోని హార్మోన్స్ పసిపిల్లలకు ప్రశాంతత నిచ్చి నిద్రపుచ్చుతాయి.
తల్లిపాలు బిడ్డను చెవి ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, న్యుమోనియాతో పాటు ఇతరత్రా శిశువ్యాధుల నుంచి రక్షిస్తాయి.
తల్లిపాలలో సజీవ స్టెమ్ కణా లుంటాయి. ఇవి శిశువు శరీరంలోకి ప్రవేశించి, కీలక అవయవాల అభివృద్ధికి, వాటి మరమ్మతుకు సాయపడతాయి.
శిశువుకు తొలిపాలు లేదా కొలొస్ట్రమ్- యాంటీ బాడీలతో సమృద్ధిగా ఉండి, నవజాత శిశువుకు రోగ నిరోధకశక్తి పెరగడానికి తోడ్పడతాయి.
ఆసియాలోనే తొలి హ్యూమన్ మిల్క్ బ్యాంక్‌ను 1989లో ముంబయ్‌లోని సియోన్ ఆసుపత్రిలో ప్రారంభించారు.
తల్లిపాలు పట్టడంలో ‘గోల్డెన్ రూల్’ ఉంటుంది. అంటే... పుట్టిన మొదటి గంటలోనే పాలు పట్టడం చేయాలి. బిడ్డ అడిగినప్పుడల్లా అంటే రోజుకు 8 నుంచి 12 సార్లు పాలు ఇవ్వాలి. బిడ్డకు స్పర్శానుభూతిని అందించాలి.
మనదేశంలో 100 నుంచి 125దాకా హ్యూమన్ మిల్క్ బ్యాంకులు (హెచ్‌ఎంబీ) ఉన్నాయి.

వీటిని ప్రభుత్వశాఖలతో పాటు కొన్ని హాస్పిటల్స్, ఎన్జీవోలు నిర్వహిస్తున్నాయి. తల్లిపాలను దాతల నుంచి సేకరించి, పాశ్స్చరైజ్ చేసి, బరువు తక్కువగా ఉన్న పిల్లలకు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్‌లో అందిస్తాయి.
పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా మధుమేహంతో పాటు రొమ్ము, అండాశయ క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది. ప్రసవానంతర డిప్రెషన్ నుంచి కూడా కాపాడుతుంది.
పిల్లలకు పాలు పట్టిస్తున్నారు కాబట్టి తల్లులు ఏవి పడితే అవి తినకూడదనేది అపోహ మాత్రమే. ఆహారాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి తల్లిపాల కాకపోతే సమతుల ఆహారంపై దృష్టి పెట్టి, తగినంత నీరు తాగాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
45 నిమిషాల్లో 5 ప్లేట్ల బిర్యానీ తిన్నాడు.. భారీ బహుమతి గెలిచాడు..
సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం
Read Latest AP News And Telangana News And International News And Telugu News