Share News

కనుబొమల్లో చుండ్రు తగ్గేదెలా..?

ABN , Publish Date - Aug 02 , 2026 | 09:45 AM

ఒక్కోసారి కనుబొమల్లో కనిపించే చుండ్రుని సులువుగా నివారించే ఇంటి చిట్కాలివే...

కనుబొమల్లో చుండ్రు తగ్గేదెలా..?
Eyebrow Dandruff

ఒక్కోసారి కనుబొమల్లో కనిపించే చుండ్రుని సులువుగా నివారించే ఇంటి చిట్కాలివే...

  • రాత్రి పడుకునేముందు చిన్న గిన్నెలో రెండు చెంచాల బాదం నూనె వేసి గోరువెచ్చగా వేడి చేయాలి. ఆపైన దీన్ని చూపుడు వేలితో కొద్దిగా తీసుకుంటూ కనుబొమలపై సున్నితంగా మర్దన చేయాలి. ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. క్రమం తప్పకుండా వారం పాటు ఇలా చేస్తుంటే సమస్య తీరుతుంది.

  • రోజుకు రెండుసార్లు వేప నూనెను కనుబొమలపై రాసుకుంటుంటే నాలుగు రోజుల్లో చుండ్రు మాయమవుతుంది. వేపలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ప్రభావవంతంగా పనిచేసి చర్మ సమస్యలను నిరోధిస్తాయి.

  • ఒక గిన్నెలో ఒక చుక్క టీ ట్రీ ఆయిల్‌, పన్నెండు చుక్కల కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తరచూ కనుబొమలకు రాస్తుంటే చుండ్రు తగ్గుతుంది.

  • రెండు చెంచాల మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తగా నూరాలి. ఈ పేస్టుని కనుబొమలకు పట్టించి అరగంటసేపు ఆరనివ్వాలి. ఆపైన గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే చుండ్రు క్రమంగా తగ్గుతుంది. కనుబొమలు ఒత్తుగా పెరుగుతాయి కూడా.

  • కొద్దిగా కలబంద గుజ్జును తీసుకుని మంచినీటితో రెండుసార్లు శుభ్రంగా కడిగి ఆపైన కనుబొమలకు పట్టించాలి. పావుగంట తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

  • చుండ్రు ఉందనిపిస్తే కనుబొమలకు ఎలాంటి మేకప్‌ వాడకూడదు. పొడి చర్మ తత్వం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది కాబట్టి తరచూ మంచినీటిని తాగుతుండాలి. సీ విటమిన్‌ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

Updated Date - Aug 02 , 2026 | 09:45 AM