ఉద్యమ సహచరుడు చనిపోతే వెళ్లని కేసీఆర్ మళ్లీ సీఎం ఎలా అవుతారు?: మంత్రి కోమటిరెడ్డి
ABN , Publish Date - Aug 02 , 2026 | 09:33 AM
తోటి ఉద్యమ సహచరుడు మృతి చెందితే వెళ్లని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం ఎలా అవుతారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
నల్లగొండ: తోటి ఉద్యమ సహచరుడు మృతి చెందితే వెళ్లని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం ఎలా అవుతారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి చనిపోతే ఆయన కుటుంబాన్ని ఓదార్చడానికి కేసీఆర్ వెళ్లలేదని విమర్శించారు. కారులో వెళ్తే రెండు గంటల్లో వరంగల్ వెళ్లేవారని, లేదంటే ఆయనకు డబ్బులు ఉన్నాయి కదా హెలికాప్టర్ తీసుకొనైనా వెళ్లాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పదేపదే ఆయన తండ్రి మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడని అంటుంటారని, ఫామ్‌హౌ్‌సకే పరిమితమవుతూ ప్రజల సమస్యలు పట్టించుకోని కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యే ప్రసక్తే లేదన్నారు. బీఆర్‌ఎ్‌సను ప్రజలు మరిచిపోయారని, మరో 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని చెప్పారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తనపై కోపంతో పాటు తనకు ఎక్కడ పేరు వస్తుందనే దుర్మార్గపు ఆలోచనతో శ్రీశైలం సొరంగమార్గాన్ని పూర్తి చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం 2028 జూలై నాటికి సొరంగమార్గం పనులు పూర్తిచేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్షమించడం కాదు... క్షమాపణ చెప్పండి.. ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు
నీట్ పీజీ అభ్యర్థులకు పెద్ద ఊరట
For More TG News And Telugu News