క్షమించడం కాదు... క్షమాపణ చెప్పండి.. ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు
ABN , Publish Date - Aug 02 , 2026 | 08:56 AM
’’మోదీ జీ.. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులు.. తమను క్షమించడం కాదు.. తమకు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్నారా?.’’ అని ప్రధానిని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: ‘‘మోదీ జీ.. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులు.. తమను క్షమించడం కాదు.. తమకు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్నారా?.’’ అని ప్రధానిని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘విద్యార్థులను ఆయన క్షమించడం కాదు, వారికే ఆయన క్షమాపణలు చెప్పాలి.’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. శనివారం రాహుల్ తమిళనాడులో పర్యటించారు. నీట్ పరీక్ష రద్దు కారణంగా ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలుసుకున్నారు. మామళ్లపురంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించిన రాహుల్.. వారికి ధైర్యం చెప్పారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్ష రద్దు కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆ విద్యార్థుల కుటుంబాల్లోని ఒక్కరిని కూడా ప్రధాని పరామర్శించలేదని విమర్శించారు. నీట్ పేపర్ లీక్, రద్దుతో ఏళ్ల తరబడి విద్యార్థులు పడ్డ కష్టం ఒక్కరాత్రిలో నాశనం అయిందని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీపై కేసు నమోదు..
సనాతన ధర్మాన్ని అవమానించడంతో పాటు మతపరమైన మనోభావాలను దెబ్బతీశారన్న ఆరోపణలపై రాహుల్ గాంధీ, ఎంపీలు రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్, అవదేశ్ ప్రసాద్‌పై వారాణసీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయోధ్యలో విరాళాల చోరీపై ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో శుక్రవారం ఒక వ్యంగ్య నాటకం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ నాటకంలో కాషాయాన్ని, హిందూ దేవతలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడటం ద్వారా తమ మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ పలువురు సాధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నీట్ పీజీ అభ్యర్థులకు పెద్ద ఊరట
ప్రజల్ని చీమలతో పోల్చేవారు జడ్జీలవుతున్నారు!
For More National News And Telugu News