దేశంలోనే నెంబర్ వన్‌గా తెలంగాణ మీసేవ
ABN , Publish Date - Aug 02 , 2026 | 09:40 AM
ప్రభుత్వ సేవలు, లావాదేవీలను ఆన్‌లైన్‌లో ఒకే వేదిక మీద అందిస్తోన్న రాష్ట్ర మీసేవ మరొక రికార్డును నమోదు చేసింది. దీనిద్వారా శుక్రవారం ఒక్కరోజే 2,20,172 లావాదేవీలు నమోదు అయ్యాయి.
ఒకే రోజులో రెండు లక్షలు దాటిన లావాదేవీలు
హైదరాబాద్: ప్రభుత్వ సేవలు, లావాదేవీలను ఆన్‌లైన్‌లో ఒకే వేదిక మీద అందిస్తోన్న రాష్ట్ర మీసేవ మరొక రికార్డును నమోదు చేసింది. దీనిద్వారా శుక్రవారం ఒక్కరోజే 2,20,172 లావాదేవీలు నమోదు అయ్యాయి. ఇలా ఒక్కరోజులో రికార్డు స్థాయిలో ఎలాంటి అంతరాయాలు లేని లావాదేవీల ద్వారా దేశంలోనే నెంబర్ వన్ గవర్నమెంట్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌గా రాష్ట్ర మీసేవ నిలిచిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఈమేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మీసేవ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ను మరింతగా అభివృద్ధి చేయడం, సేవలను విస్తృత పరచడం, ఆమేరకు ప్రజల వినియోగాన్ని ప్రోత్సహించడంలో ప్రజాప్రభుత్వం చొరవ చూపిస్తోందని, దాంతో కొత్త రికార్డులు నమోదవుతున్నాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యమ సహచరుడు చనిపోతే వెళ్లని కేసీఆర్ మళ్లీ సీఎం ఎలా అవుతారు?: మంత్రి కోమటిరెడ్డి
క్షమించడం కాదు... క్షమాపణ చెప్పండి.. ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు
For More TG News And Telugu News