రేసింగ్ ట్రాక్‌పై విజయ్–అజిత్ ఆత్మీయ కలయిక.. టీవీకే రాజకీయ లాభం కోసమేనా?
ABN , Publish Date - Sep 14 , 2026 | 02:12 PM
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, స్టార్ హీరో అజిత్ కుమార్ మధ్య యూకేలో జరిగిన ఆత్మీయ భేటీ ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆ ఇద్దరు నటుల అభిమానుల మధ్య వైరం ఉంది.
ఇంటర్‌నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, స్టార్ హీరో అజిత్ కుమార్ మధ్య యూకేలో జరిగిన ఆత్మీయ భేటీ ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆ ఇద్దరు నటుల అభిమానుల మధ్య వైరం ఉంది. ఇప్పుడు విజయ్, అజిత్ ఒక్కచోట కలవడం ఒకవైపు ఆసక్తి రేపితే.. మరోవైపు రేసింగ్ ఈవెంట్‌ను విజయ్ ప్రారంభించడం, తమిళనాడులో ప్రపంచస్థాయి మోటార్ రేసింగ్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళికలకు అజిత్ మద్దతు ఇవ్వడం.. ఈ పరిణామాలన్నీ టీవీకే రాజకీయ వ్యూహంపై కొత్త చర్చకు తెరతీశాయి.
కొన్నేళ్లుగా విజయ్, అజిత్‌ను వారి అభిమానులు రజనీకాంత్, కమల్ హాసన్ జోడీకి వారసులుగా భావిస్తున్నారు. సాధారణంగా విజయ్ మాస్ అపీల్‌ను ఆయన అభిమానులు రజనీకాంత్‌తో పోలిస్తే.. అజిత్‌ను ఆయన ఫ్యాన్స్ విలక్షణ నటుడు కమల్ హాసన్‌తో పోలుస్తారు. ఆ ఇద్దరి నటుల అభిమానుల మధ్య గొడవ తెరమీదే పరిమితం కాలేదు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికలపైనా ఇరు వర్గాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. అలాగే నడి వీధుల్లోనూ గొడవ పడిన దృష్టాంతాలూ ఉన్నాయి. తాజాగా యూకేలో విజయ్, అజిత్ మధ్య జరిగిన ఆత్మీయ కలయిక వారి ఫ్యాన్స్‌లో ఆసక్తిని కలిగించింది.
అభిమానులు ఐక్యంగా ఉండాలి: తమిళనాడు మంత్రి
విజయ్, అజిత్‌ల అభిమానులు ఐక్యంగా ఉండాలని, గొడవపడకూడదని తమిళనాడు మత్స్యశాఖ మంత్రి ఎ.శ్రీనాథ్ కోరారు. ‘తమిళ సినిమాకు తల అజిత్, దళపతి విజయ్ పెద్ద స్తంభాలు. ఇప్పటి తరానికి ఇద్దరూ కీలకం. ఇటీవలే యూకేలో జరిగిన ఈవెంట్ ఆ ఇద్దరి మధ్య స్నేహానికి చిహ్నంగా నిలుస్తుంది’ అని శ్రీనాథ్ అన్నారు. కాగా.. విజయ్, అజిత్ ఆత్మీయ కలయికను కొందరు అభిమానులు స్వాగతిస్తుండగా.. మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘ఇద్దరి హీరోలను చూస్తుంటే రజనీకాంత్, కమల్ హాసన్ల పరిపక్వతను చూస్తున్నట్లు ఉంది’’ అని అజిత్ ఫ్యాన్ ఒకరు పేర్కొన్నారు. ఆ ఇద్దరిని ప్రత్యర్థులుగా చూస్తున్న టైంలో వారు ఆత్మీయంగా పలకరించుకోవడం అద్భుతమని విజయ్ అభిమాని ఒకరు హర్షం వ్యక్తం చేశారు.
విజయ్ స్వప్రయోజనాల కోసమే ఇదంతా..
విజయ్, అజిత్ భేటీపై అజిత్ అభిమానులు కొందరు భిన్నంగా స్పందించారు. విజయ్ తన స్వప్రయోజనాల కోసమే అజిత్‌ను కలిశారని, రాజకీయ లబ్ధి కోసం విజయ్ అలా కలిసి ఉండవచ్చని చెప్పారు. కాగా.. తమిళనాడులోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థులను ఓడించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తర్వాత తమ పదవులకు రాజీనామా చేసి రూలింగ్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆ రెండు చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే, అజిత్ అభిమానులు గత ఎన్నికల్లో టీవీకేకు ఓటు వేయలేదని, ఈ నేపథ్యంలో అజిత్ అభిమానుల ఓట్ల కోసం యూకేలో విజయ్ ఆయనను ఆత్మీయంగా కలిసి ఉండవచ్చని అజిత్ అభిమానులు కొందరు చర్చించుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రోశయ్య దూరదృష్టితోనే తెలంగాణకు మిగులు బడ్జెట్: సీఎం రేవంత్‌రెడ్డి
ఢీ10 డ్యాన్స్ విన్నర్ రాజు కేసు.. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డ్
మట్టి వినాయకుడిని పూజించాలి: హరీశ్‌రావు