నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోబోమని ముందే చెప్పాం: బీసీసీఐ సెక్రటరీ
ABN , Publish Date - Sep 14 , 2026 | 11:56 AM
పాకిస్థాన్ మంత్రి, ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ నుంచి తాము ట్రోఫీ అందుకోవడానికి సిద్ధంగా లేనట్టు ముందే చెప్పామని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: నిన్న(ఆదివారం) మహిళల ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఘనవిజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు శ్రీలంకను 72 పరుగులతో చిత్తుగా ఓడించింది. అయితే ఊహించినట్టుగానే పాకిస్థాన్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఛైర్మన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్‌ను తీసుకోవడానికి టీమ్ఇండియా నిరాకరించింది.
భారత్ గెలిస్తే ఏసీసీ ఛైర్మన్ నుంచి ట్రోఫీ ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోబోమని తాము ముందే చెప్పామని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. ఆయనకు బదులుగా ఏసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఖలీద్ అల్ జరూనీ ట్రోఫీ ఇస్తే కచ్చితంగా తీసుకుంటామని సూచించినట్టు వెల్లడించారు. అయితే నఖ్వీ ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. దీంతో గ్రౌండ్‌కు ట్రోఫీని తీసుకురాలేదు. ప్లేయర్లు అవార్డ్ ప్రజెంటేషన్‌లో కూడా పాల్గొనలేదు.
2025లో కూడా మోసిన్ నఖ్వీ నుంచి పురుషుల ఆసియా కప్ స్వీకరించడానికి సూర్యకుమార్ సేన అంగీకరించలేదనే విషయం తెలిసిందే. ఆ ట్రోఫీ ఇప్పటివరకు భారత్‌కు అందలేదు. ఈ రెండు ట్రోఫీలూ త్వరలోనే భారత్‌కు వస్తాయని సైకియా పేర్కొన్నారు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టీమ్ఇండియా ఆ ట్రోఫీని స్వీకరించలేదు.
ఈ వార్తలు కూడా చదవండి
భారత క్రికెట్‌కు గర్వకారణం.. మహిళల జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసలు..