దూరంగా ఉండమని చెప్పినందుకు కారుతో ఢీకొట్టి పరార్.. వీడియో వైరల్..
ABN , Publish Date - Sep 14 , 2026 | 10:52 AM
రోడ్లపై కొందరు వ్యక్తుల అహంకారం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అర్థమవుతుంది. గురుగ్రామ్‌లో ఓ మహిళా బైకర్‌ను ఓ కారు ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: రోడ్లపై కొందరు వ్యక్తుల అహంకారం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అర్థమవుతుంది. గురుగ్రామ్‌లో ఓ మహిళా బైకర్‌ను ఓ కారు ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారులో ఉన్న వ్యక్తులు తనను వెంబడిస్తూ ఇబ్బంది పెట్టారని, దూరంగా ఉండాలని చెప్పిన తర్వాతే కారు తన బైక్‌ను ఢీకొట్టిందని బాధితురాలు ఆరోపించింది (Gurugram hit and run).
ఈ ఘటన ఆదివారం గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌పై జరిగినట్లు బాధితురాలు సియా తెలిపింది. ఆమె తన బైకింగ్ గ్రూప్‌తో కలిసి స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా ఓ కారు తమను అనుసరిస్తూ వచ్చిందని సియా ఆరోపించింది. కారులో ఉన్న వ్యక్తులు దూకుడుగా ప్రవర్తించారని, వారు ఆల్కహాల్ సేవించి ఉన్నారని సియా పేర్కొంది. తనకు దగ్గరగా రావడంతో, కాస్త దూరంగా ఉండాలని చెప్పినట్లు వెల్లడించింది. అయితే కారు ఆగకుండా తనను వెంబడించిందని సియా పేర్కొంది (Woman biker accident Gurugram).
కారులో ఉన్న వ్యక్తులు బైక్‌ను ఆపాలని చెప్పారని, వారు మద్యం మత్తులో ఉన్నట్లు తనకు అనిపించిందని సియా తెలిపింది (Gurugram road rage). ఆ కారులోని వ్యక్తులు తనను వెంబడించి ఢీకొట్టారని పేర్కొంది. బైక్‌ను కారు కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ మొత్తం ఘటనను ఆమె బైక్‌కు అమర్చిన యాక్షన్ కెమెరా రికార్డు చేసింది. ఈ ఘటనపై సియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోడ్లపై ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..