Share News

భారత క్రికెట్‌కు గర్వకారణం.. మహిళల జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసలు..

ABN , Publish Date - Sep 14 , 2026 | 11:12 AM

భారత మహిళల క్రికెట్ జట్టు మరోసారి ఆసియా కప్‌ విజేతగా నిలిచింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

భారత క్రికెట్‌కు గర్వకారణం.. మహిళల జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసలు..
Indian women cricket team

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల క్రికెట్ జట్టు మరోసారి ఆసియా కప్‌ విజేతగా నిలిచింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రక విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా భారత మహిళల జట్టుకు అభినందనలు తెలిపారు (PM Modi Indian women cricket team).


'భారత క్రికెట్‌కు ఇది ఒక గర్వించదగిన క్షణం. ఆసియా కప్‌ను గెలుచుకున్న మహిళల జట్టుకు అభినందనలు. టోర్నమెంట్ అంతటా వారి ఆత్మవిశ్వాసం, నిలకడ, అద్భుతమైన స్ఫూర్తి ప్రస్ఫుటంగా కనిపించాయి. ఈ విజయం దేశంలోని లక్షలాది మంది యువతకు స్ఫూర్తినిచ్చి.. మరింత మంది క్రీడల వైపు అడుగులు వేసేలా చేయాలి' అని ప్రధాని ఆకాంక్షించారు (India vs Sri Lanka final).


దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 183/5 పరుగుల భారీ స్కోరు సాధించింది (India Women Asia Cup win). ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు 111 పరుగులకే కట్టడి చేశారు. శ్రీ చరణి నాలుగు వికెట్లు, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు.


ఇవి కూడా చదవండి..

విఘ్ననాశాయా.. వినాయకాయా..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 14 , 2026 | 11:32 AM