Share News

గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు.. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పోస్టు..

ABN , Publish Date - Sep 14 , 2026 | 10:55 AM

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులందరికీ గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విఘ్నాలను తొలగించే వినాయకుడి దర్శనం, పూజలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన శక్తి, ఉత్సాహం నిండాలని ఆయన ఆకాంక్షించారు.

గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు.. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పోస్టు..
PM Modi Ganesh Chaturthi Wishes

న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులందరికీ గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విఘ్నాలను తొలగించే వినాయకుడి దర్శనం, పూజలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన శక్తి, ఉత్సాహం నిండాలని ఆయన ఆకాంక్షించారు. భగవంతుడి దివ్య ఆశీస్సులతో చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని, దేశం నిరంతర ప్రగతి పథంలో ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.


ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'మోదక ప్రసాదాన్ని ఇష్టపడే, ముక్తిని కోరుకునే, శిరస్సుపై చంద్రుడిని ధరించిన, అందరినీ కాపాడే వినాయకుడికి నమస్కరిస్తున్నాను. సాటిలేని ఏకైక ప్రభువు, దుష్ట రాక్షసులను సంహరించే వాడు, భక్తుల సమస్త కష్టాలను తొలగించే వినాయకుడికి వందనం' అంటూ ఆయన తన భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. అలాగే, పండుగ వేళ దేశ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. చివరగా 'గణపతి బప్పా మోరియా' అంటూ ప్రధాని మోదీ తన సందేశాన్ని ముగించారు.


ఈ వార్తలు కూడా చదవండి

పశ్చిమ బెంగాల్‌లో డీఆర్‌డీవో పరీక్ష కేంద్రం

కారు పార్కింగ్ విషయంలో గొడవ.. కార్గిల్ వెటరన్‌పై దాడి..

Updated Date - Sep 14 , 2026 | 11:02 AM