Share News

పశ్చిమ బెంగాల్‌లో డీఆర్‌డీవో పరీక్ష కేంద్రం

ABN , Publish Date - Sep 14 , 2026 | 06:52 AM

దేశ రక్షణ రంగానికి ఊతమిచ్చేలా.. క్షిపణి పరీక్షల సామర్థ్యాన్ని మరింత విస్తరించేలా కీలక ముందడుగు పడింది. డీఆర్‌డీవో పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా ఆయుధ, క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.

పశ్చిమ బెంగాల్‌లో డీఆర్‌డీవో పరీక్ష కేంద్రం
drdo

పశ్చిమ బెంగాల్‌లో డీఆర్‌డీవో పరీక్ష కేంద్రం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: దేశ రక్షణ రంగానికి ఊతమిచ్చేలా.. క్షిపణి పరీక్షల సామర్థ్యాన్ని మరింత విస్తరించేలా కీలక ముందడుగు పడింది. డీఆర్‌డీవో పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా ఆయుధ, క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. బంగాళాఖాతం తీర ప్రాంతంలోని పూర్బా మేదినీపూర్‌ జిల్లా జున్‌పుట్‌ గ్రామంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు డీఆర్‌డీవో ప్రతిపాదనకు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రతిపాదిత కేంద్రం.. ఒడిశాలోని చాందీపూర్‌లో ప్రస్తుతం ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌)కు అనుంబంధంగా ఉంటుంది. దీనిపై పనిభారాన్ని తగ్గించి, తూర్పు తీరంలో దేశ రక్షణ పరీక్షల సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మేదినీపూర్‌లో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 2024 ఏప్రిల్‌లోనే డీఆర్‌డీవో ప్రతిపాదించింది. కానీ, అప్పటి తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం దీనిపై స్పందించలేదని, భూ కేటాయింపులు చేయలేదని పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి తెలిపారు.

Updated Date - Sep 14 , 2026 | 06:56 AM