జమ్మూ కశ్మీర్‌లో గంటల వ్యవధిలో మళ్లీ భూ ప్రకంపనలు
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:51 PM
జమ్మూ కశ్మీర్ లడఖ్‌లోని లేహ్‌లో మళ్లీ భూ ప్రకంపనలు వచ్చాయి. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఈ ప్రకంపనలు రావడంతో.. స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
శ్రీనగర్, ఆగస్టు13: జమ్మూ కశ్మీర్ లడఖ్‌లోని లేహ్‌లో మళ్లీ భూ ప్రకంపనలు వచ్చాయి. గురువారం ఉదయం 9.54 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 4.3గా నమోదయింది. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (ఎన్‌సీఎస్) వివరించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కానీ జరగలేదని వెల్లడించింది.
అయితే గురువారం ఉదయం 6 గంటలకు భూప్రకంపనలు వచ్చాయని తెలిపింది. దీని తీవ్రత 5.5గా నమోదు అయిందని పేర్కొంది. కేవలం నాలుగు గంటల వ్యవధిలో ఈ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. లడఖ్ తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతంగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
హఫీజ్ సయీద్‌కు మద్దతు ప్రకటించి.. భారత్‌పై విషం కక్కిన పాక్ మాజీ మంత్రి
ఖర్గే ర్యాలీ తరువాత మైదానంలో ‘శుద్ధి’.. మండిపడ్డ కాంగ్రెస్ ప్రెసిడెంట్
For National News And Telugu News