ఖర్గే ర్యాలీ తరువాత మైదానంలో ‘శుద్ధి’.. మండిపడ్డ కాంగ్రెస్ ప్రెసిడెంట్
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:34 PM
ఉత్తరాఖండ్ రామ్‌లీలా గ్రౌండ్‌లో తన ర్యాలీ తరువాత శుద్ధి కార్యక్రమం నిర్వహించడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్ రామ్‌లీలా గ్రౌండ్‌లో తన ర్యాలీ తరువాత శుద్ధి కార్యక్రమం నిర్వహించడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. భారత్‌లో దళితులకు స్థానం లేదని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మేమెప్పటి నుంచో ఇదే విషయాన్ని చెబుతున్నాము. మతం పేరిట వారు ప్రజల మధ్య విభజనలు సృష్టిస్తున్నారు. ఈ దేశంలో దళితులకు స్థానం లేదు. అక్కడ శుద్ధి పేరిట హోమం నిర్వహించాల్సిన అవసరం ఏముంది?’ అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రామ్‌లీలా మైదాన్ ప్రజాసమావేశాల కోసం ఉద్దేశించిన వేదిక. అన్ని పార్టీలు అక్కడ సమావేశాలు నిర్వహిస్తాయి. అసలు వాళ్లు చేసింది హిందూ మత వ్యతిరేకం. రెండోది ఏంటంటే వాళ్లు వివిధ వర్గాల మధ్య వివాదాలు సృష్టించి దేశంలో చీలికలు తెస్తున్నారు’ అని అన్నారు.
పార్లమెంటులో కూడా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఈ అంశాన్ని లేవనెత్తారు. తాను రామ్‌లీలా మైదానంలో ఏ పార్టీనీ విమర్శించకపోయినా బీజేపీ వాళ్లు ర్యాలీ తరువాత శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించారని ఆరోపించారు. ఈ ఘటనపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ జేపీ నడ్డా మాట్లాడుతు ఈ కార్యక్రమం దురదృష్టకరమని అన్నారు. ఆ కార్యక్రమంలో తమ పార్టీ వారెవరూ పాల్గొనలేదని కూడా స్పష్టం చేశారు. ఘటనపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.
శనివారం రాష్ట్రంలోని హల్ద్వానీ మైదానంలో విజయ్ శంఖనాద్ పేరిట నిర్వహించిన ర్యాలీలో ఖర్గే పాల్గొని ప్రసంగించారు. ఆ తరువాత రెండు రోజులకు ఆగస్టు 10న శ్రీరామ సేన అనే సంస్థ అక్కడ శుద్ధీకరణ హోమం నిర్వహించిందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇది భారీ వివాదానికి దారి తీసింది.
ఈ వార్తలనూ చదవండి:
హఫీజ్ సయీద్‌కు మద్దతు ప్రకటించి.. భారత్‌పై విషం కక్కిన పాక్ మాజీ మంత్రి
ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర.. యూఎన్ నివేదికలో కీలక విషయాలు