Share News

ఏనుగు మెడకు ఇరుక్కుపోయిన ట్రాక్టర్ టైర్.. చివరకు.?

ABN , Publish Date - Sep 10 , 2026 | 09:53 PM

ప్రమాదవశాత్తూ ఏనుగు మెడకు ట్రాక్టర్ టైర్ ఇరుక్కుపోయింది. దాన్ని తొలగించేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది.

ఏనుగు మెడకు ఇరుక్కుపోయిన ట్రాక్టర్ టైర్.. చివరకు.?
Elephant

ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలోని గువాహటిలో ఓ ఏనుగు మెడకు ట్రాక్టర్ టైర్ ఇరుక్కుపోయింది. అసౌకర్యంగా ఉన్న ఏనుగును చూసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నుమాలిగఢ్ సమీపంలోని తేయాకు తోటల్లో ఈ రోజు(గురువారం) ఈ ఏనుగు కనిపించింది. ఆహారం కోసం తోటల్లోకి వచ్చిన గజరాజును కొందరు ఫొటో తీసి, సోషల్ మీడియాలోషేర్ చేయగా అధికారులు స్పందించారు.


అడవిలో ఎవరో పడేసిన టైర్‌ను ఏనుగు తొండంతో తీయబోగా.. ప్రమాదవశాత్తూ అది దాని మెడకు ఇరుక్కుపోయి ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే.. దీనిపై అక్కడి ఎమ్మెల్యే కూడా స్పందించారు. ఏనుగు కోసం ఓ ప్రత్యేక టీమ్‌ను పంపించామని తెలిపారు. ఇప్పటికే అసౌకర్యంలో ఉన్న దానికి ఇబ్బంది కలిగించే విధంగా టైర్‌ తొలగించవద్దని స్థానికులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీ సిబ్బంది కంగారు పడకుండా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఏనుగుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టైర్‌ను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

కుక్కపిల్లతో ఆప్యాయంగా ఆడుతున్న బాలిక.. నెటిజన్ల ఫిదా

ఏఐ ఫేక్ వీడియోలతో మోసాలు.. ప్రజలకు ప్రియాంక గాంధీ ఆఫీస్ హెచ్చరిక..

Updated Date - Sep 10 , 2026 | 09:58 PM