Share News

మా ప్రధానిని భారత్ ఆహ్వానించలేదు.. బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ దూరం..

ABN , Publish Date - Sep 10 , 2026 | 09:00 PM

ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ హాజరుకావడం లేదని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయనకు బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానం అందలేదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ గురువారం వెల్లడించారు.

మా ప్రధానిని భారత్ ఆహ్వానించలేదు.. బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ దూరం..
Tarique Rahman India visit

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ హాజరుకావడం లేదని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయనకు బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానం అందలేదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ గురువారం వెల్లడించారు. దీంతో తారిక్ రెహ్మాన్ భారత్ పర్యటనపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే (Tarique Rahman India visit).


బంగ్లాదేశ్ ప్రధాని హోదాలో కాకుండా బిమ్‌స్టెక్ చైర్మన్‌గా తారిక్ రెహ్మాన్‌ను బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానించారని హుమాయున్ చెప్పారు. 'మా ప్రధానికి ఆహ్వానం అందలేదు. అలాంటప్పుడు మేం అక్కడకు ఎందుకు వెళ్తాం. అయినా తారిక్ రెహ్మాన్ తొలి భారత్ పర్యటన అనేక దేశాలు హాజరయ్యే కార్యక్రమంలా ఉండకూడదు. సమయం అనుకూలంగా ఉన్నప్పుడు పరస్పర గౌరవంతో కూడిన పరిస్థితుల్లో ద్వైపాక్షిక పర్యటన జరుగుతుంది. తారిక్ భారత పర్యటనకు అంత తొందరేమీ లేదు' అని హుమయూన్ స్పష్టం చేశారు (Bangladesh PM BRICS Summit).


బంగాళాఖాతం చుట్టూ ఉన్న దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, భద్రత, కనెక్టివిటీ వంటి రంగాల్లో సహకారం కోసం ఏర్పడిన ప్రాంతీయ కూటమి బిమ్‌స్టెక్ (Tarique Rahman Modi). ఇది 1997లో ఏర్పడింది. ఇందులో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కూటమికి బంగ్లాదేశ్ చైర్మెన్‌గా ఉంది.


ఇవి కూడా చదవండి..

సస్పెన్స్‌కు తెర.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్..


ఐఫోన్ ధరలు ఎందుకు తగ్గడం లేదు.. భారత్‌లో యాపిల్ వ్యూహం ఇదేనా..

Updated Date - Sep 10 , 2026 | 09:00 PM