పాకిస్థాన్ కంటే భారత్ వద్దే ఎక్కువ అణ్వాయుధాలు.. తాజా నివేదికలో సంచలన విషయాలు..
ABN , Publish Date - Sep 10 , 2026 | 09:40 PM
భారత్-పాకిస్థాన్ మధ్య అణ్వాయుధ పోటీపై మరో కీలక నివేదిక వెలువడింది. పాకిస్థాన్ కంటే భారత్ వద్దే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నట్లు తాజా అంచనాలు చెబుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ మధ్య అణ్వాయుధ పోటీపై మరో కీలక నివేదిక వెలువడింది. పాకిస్థాన్ కంటే భారత్ వద్దే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నట్లు తాజా అంచనాలు చెబుతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (FAS) అంచనా ప్రకారం భారత్ వద్ద ప్రస్తుతం సుమారు 190 అణు వార్‌హెడ్లు ఉన్నాయి. వీటిలో 160కి పైగా ఇప్పటికే ఆపరేషనల్ డెలివరీ వ్యవస్థలకు అనుసంధానమై ఉన్నాయని నివేదిక పేర్కొంది (India nuclear weapons 2026).
భారత్ వద్ద ప్రస్తుతం ఉన్న ప్లూటోనియం నిల్వలను బట్టి భవిష్యత్తులో 225 వరకు అణు వార్‌హెడ్లను తయారు చేసే సామర్థ్యం ఉండొచ్చని ఎఫ్‌ఏఎస్ అంచనా వేసింది. పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం 170 అణు వార్‌హెడ్లు ఉన్నాయి. అంటే పాకిస్థాన్ కంటే భారత్ వద్ద దాదాపు 20 వార్‌హెడ్లు ఎక్కువ. భారత్ తన అణ్వాయుధాల నిల్వలను ఇదే స్థాయిలో మరింత పెంచుకుంటే భవిష్యత్తులో బ్రిటన్‌ను కూడా అధిగమించే అవకాశం ఉందనే చర్చ మొదలైంది (India Pakistan nuclear warheads).
భారత్ అణ్వాయుధ కార్యక్రమం ప్రధానంగా పాకిస్థాన్‌తో పాటు చైనాను కూడా దృష్టిలో పెట్టుకుని మారుతోంది (India nuclear arsenal). ఎఫ్‌ఏఎస్ ప్రకారం భారత్ ప్రస్తుతం తొమ్మిది రకాల అణు సామర్థ్యం ఉన్న వ్యవస్థలను నిర్వహిస్తోంది. ఇందులో విమానాలు, భూమి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు, సముద్రం నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. మరికొన్ని కొత్త వ్యవస్థలు కూడా అభివృద్ధి దశలో ఉన్నాయి. ప్రత్యేకంగా చైనా భూభాగంలోని సుదూర లక్ష్యాలను చేరుకోగల క్షిపణుల అభివృద్ధిపై భారత్ ఎక్కువగా దృష్టి పెడుతోందని గతంలో సిప్రీ నివేదిక పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
సస్పెన్స్‌కు తెర.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్..
ఐఫోన్ ధరలు ఎందుకు తగ్గడం లేదు.. భారత్‌లో యాపిల్ వ్యూహం ఇదేనా..