Share News

టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. త్రుటిలో తప్పించుకున్న నటుడు

ABN , Publish Date - Oct 18 , 2026 | 08:48 PM

బాలీవుడ్ నటుడు, జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్‌పై హత్యాయత్నం జరిగింది. ఆదివారం సాయంత్రం ముంబైలోని జుహులో బైక్‌పై ముగ్గురు దుండగులు.. టైగర్ ప్రయాణిస్తున్న కారువైపు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో టైగర్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగా.. కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి.

టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. త్రుటిలో తప్పించుకున్న నటుడు

ఇంటర్‌నెట్ డెస్క్: బాలీవుడ్ నటుడు, జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్‌పై హత్యాయత్నం జరిగింది. ఆదివారం సాయంత్రం ముంబైలోని జుహులో బైక్‌పై ముగ్గురు దుండగులు.. టైగర్ ప్రయాణిస్తున్న కారువైపు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో టైగర్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగా.. కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతరం ఒక వీడియోను దుండగులు విడుదల చేశారు. తాను లారెన్స్ బిష్ణాయ్ గ్యాంగ్‌కు చెందిన వాడినంటూ అనిల్ పండిట్ అనే వ్యక్తి చెప్పుకున్నాడు. టైగర్ ష్రాఫ్ ఎంతో కాలంగా తమ హిట్ లిస్టులో ఉన్నాడని, తమ మాట విననందుకే అతనిపై హత్యాయత్నానికి పాల్పడ్డామని ఆ వ్యక్తి పేర్కొన్నాడు.


‘టైగర్ కొంత కాలంగా సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేస్తున్నాడు. సల్మాన్‌కు దూరంగా ఉండాలని చెబుతున్నా అతను వినడం లేదు. దీంతో అతనిపై కాల్పులకు పాల్పడ్డాం’ అని ఆ వ్యక్తి చెప్పాడు. కాగా.. సల్మాన్ ఖాన్‌ను చంపుతామని గుజరాత్‌లోని జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ పలుమార్లు హెచ్చరించాడు. ఇదిలా ఉండగా.. టైగర్, సల్మాన్ కలిసి ఏ సినిమాలో కూడా పూర్తిస్థాయిలో నటించలేదు. అయినప్పటికీ వారి మధ్య సంబంధాలు ఉన్నాయి. టైగర్‌కు అవకాశం ఇవ్వాలని నిర్మాత సాజిద్ నడియావాలాకు సూచించడం ద్వారా బాలీవుడ్‌లోకి టైగర్ ఎంట్రీ కోసం సల్మాన్ సాయం చేసినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి

రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక కోరాం.. చర్యలు తీసుకుంటాం: ఏపీ ఎస్‌ఈసీ

Updated Date - Oct 18 , 2026 | 09:16 PM