క్యాన్సర్ మందులు ఇక మరింత సరసమైన ధరల్లో..
ABN , Publish Date - Oct 18 , 2026 | 07:18 PM
అత్యవసర క్యాన్సర్ మందుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విస్తరించింది. దేశంలో క్యాన్సర్ చికిత్సను మరింత సరసమైన ధరలకు అందించాలని నిర్ణయించింది. క్యాన్సర్ మందుల ధరలపై నియంత్రణను విస్తరించి, గుర్తించిన 137 రకాల క్యాన్సర్ మందుల ధరలను 70 శాతం వరకు తగ్గించనుంది.
ఇంటర్నెట్ డెస్క్: అత్యవసర క్యాన్సర్ మందుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విస్తరించింది. దేశంలో క్యాన్సర్ చికిత్సను మరింత సరసమైన ధరలకు అందించాలని నిర్ణయించింది. క్యాన్సర్ మందుల ధరలపై నియంత్రణను విస్తరించి, గుర్తించిన 137 రకాల క్యాన్సర్ మందుల ధరలను 70 శాతం వరకు తగ్గించనుంది. ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 20 రకాల క్యాన్సర్లకు ఉపయోగించే ఇమ్యునోథెరపీ మందులతో పాటు బ్రెస్ట్, ప్రోస్టేట్, పెద్దపేగు, అండాశయ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల చికిత్సకు ఉపయోగించే మందులు ఈ జాబితాలోఉన్నాయి. వచ్చే నెల(నవంబర్) 9 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. దీంతో క్యాన్సర్ రోగులకు ఏడాదికి రూ.2,500 కోట్ల వరకు ఆదా అవుతుందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ మందుల గరిష్ఠ చిల్లర ధరలో మార్జిన్ను 30 శాతానికి పరిమితం చేయనున్నారు.
ఆర్థిక భారం తగ్గించేందుకు
భారత్లో క్యాన్సర్ చికిత్స ఖర్చులు అధికంగా ఉండడంతో రోగులు, వారి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోంది. దేశంలో ఆరోగ్య సంరక్షణ కోసం చేసే మొత్తం ఖర్చులో సుమారు 44 శాతం ప్రజలు తమ జేబుల నుంచి చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలోఆసుపత్రుల్లో మందులపై అధిక ధరలు, లాభాల మార్జిన్లను నియంత్రించి వైద్య ఖర్చులను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. కాగా.. 2019లో ప్రభుత్వం 42 రకాల క్యాన్సర్ మందులపై ధరల నియంత్రణ విధించింది. అప్పట్లో కొన్ని మందుల ధరలు 90 శాతం వరకు తగ్గాయి. ఇప్పుడు మరో 137 రకాల మందులపై నియంత్రణను విస్తరించనుంది. బ్రాండెడ్, జనరిక్ మందులు, దేశీయ, దిగుమతి చేసుకున్న ఉత్పత్తులతో పాటు పేటెంట్ ఉన్నవి, పేటెంట్లేని వాటిపైనా ఈ నియంత్రణ ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
మరో ఐదేళ్లలో అంతరిక్ష యుద్ధం.. ఉపగ్రహాలపై దాడులకు అగ్రరాజ్యాల సన్నాహాలు..