Share News

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. బస్సును కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురి మృతి

ABN , Publish Date - Oct 18 , 2026 | 06:36 PM

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది.

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. బస్సును కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురి మృతి

ఇంటర్‌నెట్ డెస్క్: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. మజల్‌గావ్ తాలూకాలోని మజల్‌గావ్-తెల్గావ్ రోడ్డులో షిండేవాడి ఫటా సమీపంలోని పండర్‌పూర్-ఖామ్‌గావ్ జాతీయ రహదారిపై ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు.. ముందుగా రోడ్డుపై ఉన్న గుంతను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు కారు పూర్తిగా దెబ్బతింది.


అలాగే బస్సు ముందు భాగం కూడా దెబ్బతింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు ప్యాసింజర్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. మృతులను మజల్‌గావ్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారు ముందుగా తుల్జాపూర్‌కు వెళ్లి భవానీ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో కారులో వస్తుండగా వారి వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో కొన్ని గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. స్థానికుల సహాయంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.


ఇవి కూడా చదవండి..

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


మరో ఐదేళ్లలో అంతరిక్ష యుద్ధం.. ఉపగ్రహాలపై దాడులకు అగ్రరాజ్యాల సన్నాహాలు..

Updated Date - Oct 18 , 2026 | 06:42 PM