Share News

ప్రార్థన చేస్తున్న ఫాదర్‌ అంతలోనే.. వీడియో వైరల్

ABN , Publish Date - Oct 18 , 2026 | 04:36 PM

మృత్యువు ఏ క్షణంలో ఏం రూపంలో ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. జీవితం అంతా సజావుగా సాగిపోతుందని అనిపిస్తున్న క్షణంలో అంతా తారుమారు అయిపోతుంది. అందుకే జీవితాన్ని పెద్దలు గాలిబుడగతో పొల్చారు.

ప్రార్థన చేస్తున్న ఫాదర్‌ అంతలోనే.. వీడియో వైరల్
ecuador

ఇంటర్నెట్ డెస్క్: మృత్యువు ఏ క్షణంలో ఏం రూపంలో ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. జీవితం అంతా సజావుగా సాగిపోతుందని అనిపిస్తున్న క్షణంలో అంతా తారుమారు అయిపోతుంది. అందుకే జీవితాన్ని పెద్దలు గాలిబుడగతో పొల్చారు. అలాంటి ఓ ఘటన ఈక్వెడార్‌లో తాజాగా చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈక్వెడార్‌లో శనివారం ప్రార్థనలు నిర్వహిస్తున్న ఓ క్యాథలిక్ గురువును మృత్యువు రెప్పపాటులో కబళించింది.


ఆ వీడియోలో.. పెర్పెట్యూయో సోకోరో పారిష్ మతగురువు ఫాదర్ పాట్రిసియో ఆల్ఫ్రెడ్ సాంచెజ్ మొలినారి గ్వాయాకిల్‌లో క్రీస్తు భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అంతలో వెనుక గోడ పైభాగంలో ఉన్న ఏసు క్రీస్తు చెక్క శిలువ.. సరిగ్గా ఆయనపై బలంగా పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.


ఫాదర్ మొలినారి మరణించారని గ్వాయాక్విల్ ఆర్చిడియోసెస్ ఆదివారం సోషల్ మీడియా పోస్ట్‌లో ధృవీకరించింది. సెంట్రల్ వికారియేట్‌లోని అవర్ లేడీ ఆఫ్ పెర్పెచువల్ హెల్ప్ చర్చికి పారిష్ ప్రీష్ట్‌గా సేవలు అందిస్తున్న ఫాదర్ మొలినారి ప్రభువు సన్నిధిలో మరణించారని ప్రకటించింది. ఆయనకు ఆ ప్రభువు శాశ్వత విశ్రాంతి ప్రసాదించాలని కోరుకుంటునట్లు గ్వాయాక్విల్ ఆర్చిడియోసెస్ పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

‘ఫ్యాట్‌ డాగ్‌’ ఎన్నికలు.. గోలాకు 66,952 ఓట్లు

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌బడ్ టిప్.. చివరకు..

Updated Date - Oct 18 , 2026 | 04:47 PM