Share News

విద్యార్థినికి టీచర్ అసభ్యకర సందేశాలు.. అరెస్టు

ABN , Publish Date - Nov 25 , 2026 | 10:42 AM

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. వాట్సాప్‌లో ఆమెకు అసభ్యకర సందేశాలు పంపాడు. చివరకు కటకటాలపాలయ్యాడు.

విద్యార్థినికి టీచర్ అసభ్యకర సందేశాలు.. అరెస్టు

ఇంటర్నెట్ డెస్క్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. వాట్సాప్‌లో ఆమెకు అసభ్యకర సందేశాలు పంపాడు. చివరకు కటకటాలపాలయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని గుణలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని గుణలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 14న బాలల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం తర్వాత నరేంద్ర కుశ్వాహా అనే టీచర్ 12వ తరగతి విద్యార్థినికి వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పంపడం ప్రారంభించాడు.


తనతో కలిసి బయటకు రావాలని, తాను అడిగింది చేయాలని చెప్పాడు. తాను చెప్పినట్లు వినకపోతే, మార్కుల్లో కోత పెడతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు.. జిల్లా కలెక్టర్, సీనియర్ పోలీసు అధికారులు, స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. నరేంద్ర పంపిన వాట్సాప్ మెసేజీలను చూపింది. ఈనెల 18 నుంచి 20 మధ్య నిందితుడు తనకు ఆ సందేశాలు పంపాడని బాలిక తెలిపింది. అంతేకాకుండా స్కూల్లోని కంప్యూటర్ ల్యాబ్‌లో అతను ఒక సీక్రెట్ రూం ఏర్పాటు చేశాడని, విద్యార్థినులను అక్కడికి తీసుకెళ్లి మాట్లాడేవాడని ఆమె ఆరోపించింది. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నరేంద్రను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 10:51 AM