కర్ణాటక హైకోర్టు సీజేగా జస్టిస్ రామచంద్ర రావు
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:19 AM
త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా ఉన్న జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావును కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా..
న్యూఢిల్లీ, నవంబరు 24: త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా ఉన్న జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావును కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ విభు బక్రు, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అధ్యక్షతన మంగళవారం జరిగిన భేటీలో సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్ ఎంఎస్ రామచంద్ర రావు గతంలో తెలంగాణ, ఏపీ హైకోర్టుల్లోనూ న్యాయమూర్తిగా పని చేశారు. హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ వివేక్ సింగ్ ఠాకూర్‌కు త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని కూడా సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది.