Share News

గుజరాత్‌లో అనుమానిత జైషే ఉగ్రవాది అరెస్టు.. ఏకే 47 సీజ్

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:00 PM

గుజరాత్‌లోని వడోదరలో ఒక వ్యక్తిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో అతనికి సంబంధాలు ఉన్నట్లు ఏటీఎస్ అధికారులు అనుమానిస్తున్నారు. వడోదరలోని ఓ బస్టాండ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

గుజరాత్‌లో అనుమానిత జైషే ఉగ్రవాది అరెస్టు.. ఏకే 47 సీజ్

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లోని వడోదరలో ఒక వ్యక్తిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో అతనికి సంబంధాలు ఉన్నట్లు ఏటీఎస్ అధికారులు అనుమానిస్తున్నారు. వడోదరలోని ఓ బస్టాండ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఒక ఏకే 47 రైఫిల్‌తో పాటు 23 రౌండ్ల మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అతనికి ఆ రైఫిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి ఇవ్వడానికి అతను ఆ రైఫిల్‌ను రవాణా చేస్తున్నాడు వంటి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.


దేశంలో విదేశీ ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందిన నేపథ్యంలో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం జమ్మూకశ్మీర్‌లో కనీసం 65 మంది విదేశీ టెర్రరిస్టులు ఉన్నారు. వారిలో 55 మందికి జైషే మహమ్మద్, లష్కరే తాయిబాతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా.. కశ్మీర్ లోయలో స్థానిక ఉగ్రవాదుల సంఖ్య సున్నాకు చేరింది. దీంతో విదేశీ ఉగ్రవాదులను ఎరివేసేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్లు చేపట్టాయి. ఉగ్రవాదులకు సహకరిస్తున్న స్థానికులపైనా అధికారులు కన్నేసి ఉంచారు.


ఇవి కూడా చదవండి:

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా

ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్

Updated Date - Nov 27 , 2026 | 12:00 PM