డ్రైవర్‌ను కాలితో తన్నిన ఎమ్మెల్యే అనంత్ సింగ్.. వీడియో వైరల్
ABN , Publish Date - Nov 27 , 2026 | 11:06 AM
బిహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఈనెల 25న తన కూతురు శివంగి సింగ్ వివాహాన్ని ఘనంగా చేసిన ఎమ్మెల్యే.. తన డ్రైవర్‌ను కాలితో తన్నారు. బిహార్‌లోని పట్నా జిల్లా నడ్వాన్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఈనెల 25న తన కూతురు శివంగి సింగ్ వివాహాన్ని ఘనంగా చేసిన ఎమ్మెల్యే.. తన డ్రైవర్‌ను కాలితో తన్నారు. బిహార్‌లోని పట్నా జిల్లా నడ్వాన్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. తన కూతురి వివాహం తర్వాత ఎమ్మెల్యే ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో ఆయన తన కారు సన్‌రూఫ్ ద్వారా బయటకు కనిపించారు. ఊరేగింపునకు హాజరైన వారికి ఆయన అభివాదం చేస్తున్నారు. ఎమ్మెల్యేను చూసేందుకు ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఏమైందో ఏమో.. ఎమ్మెల్యే ఒక్కసారిగా తన సహనాన్ని కోల్పోయి డ్రైవర్‌ను కాలితో తన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఎమ్మెల్యే ప్రవర్తనను పలువురు నెటిజన్లు తీవ్రంగా ఖండించారు.
కాగా.. బిహార్‌లోని మోకామా నియోజకవర్గానికి అనంత్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ‘ఛోటే సర్కార్’ గా పేరు పొందిన ఆయన.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. మాజీ సీఎం నితీష్ కుమార్ కోసం తాను తొమ్మిది హత్యలు చేయించానంటూ గత నెలలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తర్వాత తన మాటలను ఆయన వెనక్కి తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు అదే నెలలో జేడీయూ ఆయనను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అలాగే ఓ హత్య కేసులో నిరుడు నవంబరులో ఆయన అరెస్టయ్యారు. ఈ ఏడాది మార్చిలో పట్నా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, గత నెల 30న సుప్రీంకోర్టు ఆ బెయిల్‌ను రద్దుచేసి డిసెంబరు 1లోగా లొంగిపోవాలని ఎమ్మెల్యేని ఆదేశించింది.
ఈ వార్తలూ చదవండి
అహంకారం వద్దు.. కలిసి పనిచేయాలి.. ఎస్పీతో సీట్ల పంచాయితీ వేళ ఖర్గే కీలక వ్యాఖ్యలు..
జాతీయ రహదారిపై విమానాల ల్యాండింగ్.. చరిత్ర సృష్టించిన భారత సైన్యం..