ఆందోళనల నిర్వహణపై మార్గదర్శకాలు ఉండాలి
ABN , Publish Date - Nov 27 , 2026 | 04:53 AM
ప్రజా ఆందోళనల నిర్వహణపై ఏకరూప మార్గదర్శకాలు, ప్రామాణిక కార్యాచరణ విధానాలను రూపొందించడంపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సుప్రీంకోర్టులో పిటిషన్... కేంద్రం, సీజేపీలకు నోటీసులు
న్యూఢిల్లీ, నవంబరు 26: ప్రజా ఆందోళనల నిర్వహణపై ఏకరూప మార్గదర్శకాలు, ప్రామాణిక కార్యాచరణ విధానాలను రూపొందించడంపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే విషయమై కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, ఇతరులకు నోటీసులు జారీ చేసింది. ప్రజాందోళనల నిర్వహణ విషయంలో సమగ్ర మార్గదర్శకాలు ఉండాలని, నిర్వాహకుల బాధ్యతలను స్పష్టం చేయాలని కోరుతూ లాయర్స్ వాయిస్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యాబాగ్చీ, జస్టిస్ మోహనా ధర్మాసనం ఈ నోటీసులు ఇచ్చింది.