Share News

కేజ్రీవాల్ ‘షీష్ మహల్‌’లో రూ.30 లక్షల టీవీ యూనిట్.. బీజేపీ విమర్శలు

ABN , Publish Date - Nov 27 , 2026 | 11:41 AM

: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంలోకి ఢిల్లీ ప్రభుత్వం తాజాగా ప్రజలను, మీడియాను అనుమతించింది.

కేజ్రీవాల్ ‘షీష్ మహల్‌’లో రూ.30 లక్షల టీవీ యూనిట్.. బీజేపీ విమర్శలు
Delhi Sheesh Mahal Media tour

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంలోకి ఢిల్లీ ప్రభుత్వం తాజాగా ప్రజలను, మీడియాను అనుమతించింది. ఈ భవనం ఓ షీష్ మహల్ (అద్దాల ప్యాలెస్) అంటూ బీజేపీ తరచూ అరవింద్ కేజ్రీవాల్‌పై దుమ్మెత్తి పోస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ అన్ని హంగులూ ఏర్పాటు చేసుకునేందుకు కేజ్రీవాల్ ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి సౌకర్యాలను మీడియాకు చూపుతూ మరోసారి బీజేపీ మండిపడింది.

ఆ భవనంలో రూ.30 లక్షల టీవీ యూనిట్, రూ.11.56 లక్షల షాండ్లియర్, రూ.6.71 లక్షలతో ఏర్పాటు చేసిన మందిరం, రూ.5.47 లక్షల విలువైన సోఫా సెట్ వంటి వాటిని మీడియాకు ప్రభుత్వం చూపించింది. ఈ సందర్భంగా ఢిల్లీ మంత్రి పర్వేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.


‘ప్రభుత్వ వాహనాన్ని కానీ ప్రభుత్వ భవనాన్ని కాని వాడనని ఆయన చెబుతుండే వారు. ఆ తరువాత తన అధికారిక భవనంపై రూ.56 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు’ అని విమర్శించారు. కొవిడ్-19 సంక్షోభ సమయంలో జనాలు కన్నుమూస్తున్న సమయంలో ఈ షీష్ మహల్‌ను నిర్మించారని విమర్శించారు. ఆ భవనంలోని ఓ గదిని చూపిస్తూ అక్కడి నుంచే కేజ్రీవాల్ ఫేస్‌బుక్ లైవ్‌లో పాల్గొనేవారని మంత్రి చెప్పారు. అక్కడున్న ఓ పాత కుర్చీని చూపిస్తూ తాను సాధారణ జీవితం గడుపుతున్నానని జనాలను కేజ్రీవాల్ నమ్మించేవారని ఆరోపించారు. ప్రస్తుతం పీడబ్ల్యూడీ డిపార్ట్‌మెంట్ పరిధిలో ఉన్న ఈ భవనంలో 8 బెడ్ రూమ్‌లు, 12 టాయిలెట్లు, ఒక జెకూజీ స్పా, ఖరీదైన కార్పెట్లు, ఐదు ఓఎల్‌ఈటీ టీవీలు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

డ్రైవర్‌ను కాలితో తన్నిన ఎమ్మెల్యే అనంత్ సింగ్.. వీడియో వైరల్

పశ్చిమ సరిహద్దులో మరో ఎస్‌ 400ను తరలించనున్న భారత్‌

Updated Date - Nov 27 , 2026 | 11:48 AM