అమెరికాలో మాకీస్ థ్యాంక్స్‌గివింగ్ పరేడ్ వాయిదా.. 400 విమానాల రద్దు
ABN , Publish Date - Nov 27 , 2026 | 08:44 AM
అమెరికాలో గురువారం తఫాన్ బీభత్సం సృష్టించింది. థ్యాంక్స్‌గివింగ్ వేడుకల సమయంలో భారీ వర్షాలు కురిశాయి. దీనికితోడు ఈదురుగాలులు కూడా వీచాయి. దీంతో లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో గురువారం తఫాన్ బీభత్సం సృష్టించింది. థ్యాంక్స్‌గివింగ్ వేడుకల సమయంలో భారీ వర్షాలు కురిశాయి. దీనికితోడు ఈదురుగాలులు కూడా వీచాయి. దీంతో లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. న్యూయార్క్‌లో ఏటా నిర్వహించే ప్రసిద్ధ మాకీస్ థ్యాంక్స్‌గివింగ్ పరేడ్‌ను తఫాన్ ప్రభావంతో నిర్వాహకులు వాయిదా వేశారు. వందేళ్ల చరిత్రలో తొలిసారిగా ఈ వేడుకను వాయిదా వేశారు. ‘నార్ ఈస్టర్’ గా పిలిచే ఈ తుఫాన్ సెంట్రల్ అమెరికా, తూర్పు అమెరికాను అతలాకుతలం చేసింది. తుఫాన్ ధాటికి పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, వర్జీనియా రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా తీవ్రంగా దెబ్బతింది. 9 లక్షలకు పైగా ఇళ్లు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంతేకాకుండా విమాన రాకపోకలపైనా తుఫాన్ ప్రభావం పడింది. దాదాపు 400 విమానాలు రద్దు కాగా.. మరో రెండు వేలకు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భద్రత దృష్ట్యా పరేడ్ వాయిదా
న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ వీధుల్లో రంగురంగుల భారీ బెలూన్లతో నిర్వహించే మాకీస్ థ్యాంక్స్‌గివింగ్ పరేడ్‌కు ఏటా లక్షల మంది హాజరవుతుంటారు. అయితే తుఫాన్ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని శనివారానికి వాయిదా వేశామని నిర్వాహకులు ప్రకటించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. కాగా.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వరుసగా మూడేళ్లపాటు ఈ పరేడ్‌ను రద్దు చేశారు. అన్నేళ్ల తర్వాత ఈ వేడుక నిర్వహించలేకపోవడం ఇదే తొలిసారి. పరేడ్ వాయిదా పడడంపై మాకీస్ పరేడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విల్ కాస్ విచారం వ్యక్తం చేశారు. భద్రతను దృష్టిలో ఉంచుకునే కార్యక్రమాన్ని వాయిదా వేశామని, భద్రతకే అత్యంత ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.
బయటకు రావద్దు..
తుపాను కారణంగా అమెరికా తూర్పు తీర ప్రాంతాల్లో పలుచోట్ల వరదలు వచ్చాయి. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. కొన్ని చెట్లు విద్యుత్ లైన్లు, ఇళ్లపై పడిపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని విజ్ఞప్తి చేశారు. బలమైన గాలుల కారణంగా పలు ప్రధాన వంతెనలపై రాకపోకలను నిలిపివేశారు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్