మళ్లీ ట్రంప్ సుంకాలు!
ABN , Publish Date - Nov 26 , 2026 | 04:40 AM
సుప్రీం కోర్టు మొట్టి కాయలు వేసినా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలపై వెనక్కి తగ్గడం లేదు.
భారత వస్తువులపై 25 శాతం వరకు
డీల్ కుదిరితే 17 శాతం
సెక్షన్ 301 కింద 14 దేశాలపై ట్రంప్ గురి
వాషింగ్టన్, నవంబరు 25: సుప్రీం కోర్టు మొట్టి కాయలు వేసినా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలపై వెనక్కి తగ్గడం లేదు. 1974 నాటి వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద భారత్, చైనా, ఈయూ, జపాన్, కొరియా సహా 14 దేశాలు/ఆర్థిక వ్యవస్థలపై కొత్త సుంకాలను అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్ టీ ఆర్) జేమీసన్ గ్రీర్ ప్రతిపాదించారు. భారత వస్తువులపై ఇది 25శాతం వరకు ఉంటుంది. వాణిజ్య ఒప్పందం కుదిరితే 17 శాతానికి తగ్గుతుంది. చైనా, వియత్నాంలకు ఒప్పందం కుదిరినా 20శాతం ప్రతిపాదించారు. జూలై నుంచి భారత్ చెల్లిస్తున్న 10 శాతం సుంకంపై ఇది అదనం కాదని, రెండింటిలో ఎక్కువదే వర్తిస్తుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇంధనం, ఎరువులు, కీలక ఖనిజాలు, కొన్ని ఔషధాలకు మినహాయింపు ఉంది. జనవరి 5 లోగా అభ్యంతరాలు స్వీకరించి, 25 నుంచి విచారణ జరుపుతారు. ఫిబ్రవరిలో కుదిరిన మధ్యంతర ఒప్పంద ఫ్రేమ్‌వర్క్‌పై ఇంకా సంతకాలు కాలేదు. వచ్చే నెల ఫ్లోరిడా జీ20 సదస్సులో మోదీ, ట్రంప్ భేటీ కానున్నారు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్