డీనోటిఫికేషన్‌లో డీకే శివకుమార్‌కు సుప్రీం నోటీసులు
ABN , Publish Date - Apr 24 , 2026 | 01:43 PM
బెన్నిగానహళ్ళి డీనోటిఫికేషన్ వివాదానికి సంబంధించి డీసీఎం డీకే శివకుమార్‌తో పాటు ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
బెంగళూరు: బెన్నిగానహళ్ళి డీనోటిఫికేషన్ వివాదానికి సంబంధించి డీసీఎం డీకే శివకుమార్‌తో పాటు ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బెన్నిగానహళ్ళి డీనోటిఫికేషన్ వివాదాన్ని తిరిగి విచారణ జరిపించాలని సమాజ పరివర్తన ట్రస్టు దాఖలు చేసుకున్న పిటిషన్‌కు అనుగుణంగా న్యాయమూర్తులు జేబి పార్దివాలా, విజయ్‌బిష్ణోయ్‌ల ధర్మాసనం నాలుగు వారాలలోపుగా అభ్యంతరాలను సమర్పించాలని ప్రతివాదులను నిర్దేశించింది.
డీకే శివకుమార్ తరుపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, దేవదత్ కామత్‌లు సమాజ పరివర్తన ట్రస్టు దాఖలు చేసిన అర్జీ పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషనర్ ప్రాథమిక హక్కుదారుడు కాదని అతడికి ఈ వివాదంతో ఎటువంటి సంబంధం లేదని పిటిషన్‌ను పరిగణించరాదన్నారు. అయితే ధర్మాసనం ప్రాథమిక అభ్యంతరాలను తదుపరి విచారణ సందర్భంలో పరిగణిస్తామంటూ దాటవేశారు.
బెన్నిగానహళిలో 4.20 ఎకరాల భూమిని డీనోటిఫికేషన్ చేశారు. సదరు భూమిని శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి శివకుమార్ కొనుగోలు చేశారు. ఇందులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో కర్ణాటక హైకోర్టు 2015లోనే శివకుమార్ నిర్దోషిగా తీర్పును ప్రకటించింది. ఈతర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ వార్తలు కూడా చదవండి:
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విజయం మాదే: అమిత్ షా..
ప్రమాదవశాత్తూ గుంతలో పడిపోయిన 8 మంది.. ఏం జరిగిందంటే..
Read Latest Telangana News and National News