భారీ నష్టాల్లో సూచీలు.. ఇంట్రాడేలో ఏకంగా..
ABN , Publish Date - Apr 24 , 2026 | 01:14 PM
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్స్ నష్టాలను చవిచూస్తున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్ల మేర పతనమైంది.
ఇంటర్నెట్ డెస్క్: యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతాయన్న భయాల నడుమ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో మెజారిటీ రంగాలు నష్టాలను చవి చూస్తున్నాయి. ఉదయం ఓ మోస్తరు నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తరువాత మరింత దిగజారాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్ల మేర పతనం కాగా, నిఫ్టీ కూడా 285 పాయింట్ల మేర కోల్పోయింది.
నేటి మధ్యాహ్నాం 1.02 సమయంలో సెన్సెక్స్ 76,768 వద్ద, నిఫ్టీ 23,890 వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో అమ్మకాలు పెరగడంతో సూచీలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. నిఫ్టీ 50లో ఇన్ఫోసిస్ షేర్ 5.2 శాతం మేర పతనం కాగా, హెచ్‌సీఎల్, టీసీఎస్, విప్రో షేర్లు కూడా 4 శాతానికి పైగానే పతనం అయ్యాయి. బ్యాంకింగ్ రంగంలో కూడా ఓ మోస్తరు స్థాయిలో అమ్మకాలు కనిపిస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
పసిడి, వెండి ధరలు.. నేటి రేట్స్ ఇవీ!
చాబహార్ పోర్టులో వాటాను విక్రయించే యోచనలో భారత్?