Share News

పసిడి, వెండి ధరలు.. నేటి రేట్స్ ఇవీ!

ABN , Publish Date - Apr 24 , 2026 | 10:49 AM

దేశంలో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. నేడు ధరలు ఎంత తగ్గాయంటే..

పసిడి, వెండి ధరలు.. నేటి రేట్స్ ఇవీ!
Gold, Silver Rates on April 24

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతాయన్న అంచనాల నడుమ అంతర్జాతీయ మార్కెట్స్‌లో లోహాల ధరలు తగ్గుతున్నాయి. భారత్‌లో కూడా బంగారం, వెండి ధరలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (ఏప్రిల్ 24) ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నిన్నటితో పోలిస్తే రూ.600 వేల పతనమై రూ.1,52,950కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 మేర తగ్గి రూ.1,40,200కు చేరుకుంది. నగరంలో వెండి ధర నేడు రూ.5 వేల మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.65 లక్షలుగా ఉంది.


ఇతర నగరాల్లో కూడా ధరలు ఇదే స్థాయిలో తగ్గాయి. చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,820కు పడిపోయింది. ఢిల్లీలో రూ.1,53,100కు చేరుకుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,41,000గా, ఢిల్లీలో రూ.1,40,350గా ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల ఔన్స్ (31.10 గ్రాములు) పసిడి ధర 4,672 డాలర్ల వద్ద, ఔన్స్ వెండి ధర 74 డాలర్ల వద్ద కొనసాగుతోంది.


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలూ చదవండి:

సత్తా చాటిన ఇన్ఫోసిస్‌.. క్యూ4లో గణనీయమైన లాభాలు

యూనియన్‌ బ్యాంక్‌ లాభం రూ.5,503 కోట్లు

Updated Date - Apr 24 , 2026 | 11:06 AM