Share News

మృతదేహం మీది బంగారు ఆభరణాలు మాయం

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:45 PM

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ క్రిటికల్‌ కేర్‌ విభాగంలో గురువారం తెల్లవారు జామున అనారోగ్యంతో ఏల్పుల బాలవ్వ(80) అనే వృద్ధురాలు మృతిచెందగా ఆమె చెవులకు ఉన్న ఆభరణాలు మాయమయ్యాయి.

మృతదేహం మీది బంగారు ఆభరణాలు మాయం
Jagityal hospital

  • జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన

జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ క్రిటికల్‌ కేర్‌ విభాగంలో గురువారం తెల్లవారు జామున అనారోగ్యంతో ఏల్పుల బాలవ్వ(80) అనే వృద్ధురాలు మృతిచెందగా ఆమె చెవులకు ఉన్న ఆభరణాలు మాయమయ్యాయి. కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన ఏల్పుల బాలవ్వ అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు జగిత్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం అర్ధరాత్రి చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బాలవ్వ గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకో వాలని బంధవులకు సూచించాడు.


zzzzzz.jpgదీంతో బంధువులు బాలవ్వ మృతికి సంబంధించిన సర్టిఫికెట్లను ఆసుపత్రి సిబ్బంది నుంచి తీసు కొని మృతదేహాన్ని అంబులెన్స్‌లో వారి స్వ గ్రామానికి తరలించారు. ఇంటికి వెళ్లిన తర్వాత చూడగా బాలవ్వ చెవులకు ఉన్న కమ్మలు (ఆభరణాలు) కనిపించక పోవడంతో వెంటనే ఆమె అల్లుడు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి సెక్యూరిటీ గార్డును నిలదీశాడు. అతను తనకు సంబంధం లేదని చెప్పాడు. దీంతో బాలవ్వ అల్లుడు శంకర్‌ జగిత్యాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి:

కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి ఓ హెచ్చరిక: సబిత

కిరాయి ఖాతాలు ఉంటే కఠిన చర్యలు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 24 , 2026 | 12:45 PM