రోడ్లపై తిరిగే జంతువులతో ప్రమాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ABN , Publish Date - Jul 31 , 2026 | 05:21 PM
రోడ్లపై తిరిగే జంతువులతో ప్రమాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. రోడ్లపై తిరిగే పశువులు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఢిల్లీ, జులై 31 (ఆంధ్రజ్యోతి): రోడ్లపై తిరిగే జంతువులతో ప్రమాదంపై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెల్లడించింది. రోడ్లపై తిరిగే పశువులు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్‌సింగ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. వీధి పశువులతో ప్రమాదాలు జరిగితే పరిహారం చెల్లించేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పశువులకు 'ట్యాగింగ్' తప్పనిసరని ధర్మాసనం స్పష్టం చేసింది.
వీధి జంతువుల వల్ల జరిగే రోడ్డు ప్రమాద బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా చట్టసవరణలు చేయాలని కేంద్ర, రాష్ట్రాలను ఆదేశించింది. ఆర్థిక ప్రయోజనం తీరిపోయాక పశువులను రోడ్లపై వదిలేస్తే యజమానులదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పశువులకు, జంతువులకు ట్యాగింగ్, డిజిటల్ రికార్డులు నిర్వహించాలని ఆదేశించింది. ఉపయోగం లేని పశువులను రోడ్లపై వదలకుండా సురక్షితంగా షెల్టర్ హోమ్‌లు, గోశాలలకు తరలించాలని న్యాయస్థానం వెల్లడించింది.
జంతువుల ట్యాగింగ్, షెల్టర్ల పర్యవేక్షణకు ప్రతి శాఖలో 'నోడల్ ఆఫీసర్'ను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రోడ్డుపై తిరుగుతున్న ఓ ఎద్దు దాడిలో భర్తను కోల్పోయిన పంజాబ్ మహిళకు రూ.15 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 20 ఏళ్ల విచారణ తర్వాత బాధితులను మళ్లీ సివిల్ కోర్టుకు పంపడం సరైనది కాదంటూ పంజాబ్, హర్యానా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది.
వార్తలు కూడా చదవండి...
2034 వరకూ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: సీఎం రేవంత్‌రెడ్డి
నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో కేంద్రం విప్లవాత్మక సంస్కరణలు
నీట్ పేపర్ లీక్ నిరసన.. పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News