Share News

సీఈసీ, ఈసీల నియామకాలపై భిన్న తీర్పులు.. పరిశీలనకు సుప్రీంకోర్టు అంగీకారం

ABN , Publish Date - Oct 07 , 2026 | 03:03 PM

సీఈసీ, ఈసీల నియామకాలకు సంబంధించిన 2023 చట్టంపై కోర్టులో దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ జరపాలా.. వద్దా? అనే విషయంపై సెప్టెంబర్ 23న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

సీఈసీ, ఈసీల నియామకాలపై భిన్న తీర్పులు.. పరిశీలనకు సుప్రీంకోర్టు అంగీకారం
Supreme Court

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకాలపై సెప్టెంబర్ 23న వెలువడిన భిన్న తీర్పులను పరిశీలించేందుకు సుప్రీం కోర్టు ఈరోజు (బుధవారం) అంగీకరించింది. సీఈసీ, ఈసీల నియామకాలకు సంబంధించిన 2023 నాటి చట్టంపై కోర్టులో దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ జరపాలా.. వద్దా? అనే విషయంపై గత నెల 23న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.


ఈ అంశాన్ని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించాలని జస్టిస్ దీపాంకర్ దత్తా అభిప్రాయపడితే, దీనిపై ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరపాలని జస్టిస్ శర్మ అభిప్రాయపడ్డారు. భిన్న తీర్పుల నేపథ్యంలో తగిన ధర్మాసనం ఏర్పాటు కోసం పిటిషనర్లు సీజేఐ దగ్గరకు వెళ్లారు. ఈ సందర్భంగా పిటిషన్‌ను పరిశీలించి, సరైన నిర్ణయం తీసుకుంటామని సీజేఐ సూర్యకాంత్ వెల్లడించారు.


ఈ వార్తలూ చదవండి

సుప్రీంకోర్టులో సమతుల్యత ఏదీ?

సుప్రీం జడ్జిగా అపరేశ్‌ సింగ్‌ ప్రమాణం గుజరాత్‌, ఢిల్లీ సీజేలు కూడా..

Updated Date - Oct 07 , 2026 | 03:03 PM