Share News

సుప్రీం జడ్జిగా అపరేశ్‌ సింగ్‌ ప్రమాణం గుజరాత్‌, ఢిల్లీ సీజేలు కూడా..

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:28 AM

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కొత్తగా ఎంపికైన ముగ్గురు న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు కొత్త బ్లాక్‌ ఆడిటోరియంలో మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ వీరిచే ప్రమాణస్వీకారం చేయించారు.

సుప్రీం జడ్జిగా అపరేశ్‌ సింగ్‌ ప్రమాణం  గుజరాత్‌, ఢిల్లీ సీజేలు కూడా..
apareshkumar

  • ప్రమాణ స్వీకారం చేయించిన

సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌

  • 37కు చేరిన సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య

న్యూఢిల్లీ, అక్టోబరు 6: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కొత్తగా ఎంపికైన ముగ్గురు న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు కొత్త బ్లాక్‌ ఆడిటోరియంలో మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ వీరిచే ప్రమాణస్వీకారం చేయించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సునీతా అగర్వాల్‌, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్‌ సునీతా అగర్వాల్‌ నియామకంతో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య మూడుకు చేరింది. సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో ఈ నియామకాలు జరిగాయి. ఈ ముగ్గురి రాకతో సుప్రీంకోర్టులో ప్రస్తుతం సేవలందిస్తున్న మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది. సుప్రీంకోర్టు సవరణ చట్టం ప్రకారం సీజేఐతో కలిపి సుప్రీంకోర్టులో మంజూరైన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 38 కాగా, కేవలం ఒకే ఒక్క పోస్టు ఖాళీగా ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి

ఎవ్వరూ తప్పించుకోలేరు.. రాహుల్ గాంధీ హెచ్చరిక

రాజకీయ పార్టీల ప్రతినిధుల భేటీపై ఈసీ కీలక ప్రకటన

Updated Date - Oct 07 , 2026 | 04:30 AM