Share News

అమరావతి ల్యాండ్ పూలింగ్‌పై మంత్రి నారాయణ సమీక్ష..

ABN , Publish Date - Oct 07 , 2026 | 10:00 AM

అమరావతి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై మంత్రి నారాయణ సీఆర్డీఏ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

అమరావతి ల్యాండ్ పూలింగ్‌పై మంత్రి నారాయణ సమీక్ష..
Amaravati Land Pooling,

అమరావతి, అక్టోబర్ 7: రాజధాని పరిధిలో కొనసాగుతున్న ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఆర్డీఏ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో జరిగిన సమావేశానికి సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ కార్తీక్‌తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫై చేసిన భూముల్లో ఇంకా ఎంత మేర భూమిని సమీకరించాల్సి ఉందనే అంశంపై మంత్రి ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, భూముల సమీకరణలో ఎదురవుతున్న అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాజధానిలో చేపడుతున్న రహదారులు, ఇతర నిర్మాణ పనులకు అవసరమైన భూమి ఎంత మేర ఇంకా సమీకరించాల్సి ఉందనే వివరాలను కూడా అధికారులు నుంచి తెలుసుకున్నారు.


ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రైతులతో నేరుగా మాట్లాడాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. భూములు ఇచ్చేందుకు రైతులు వ్యక్తం చేస్తున్న సందేహాలు, అభ్యంతరాలను తెలుసుకుని వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులకు ప్రక్రియకు సంబంధించిన వివరాలను స్పష్టంగా వివరించి, వారి సందేహాలను నివృత్తి చేసి ల్యాండ్ పూలింగ్‌కు సహకరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాజధానిలో కొనసాగుతున్న రహదారులు, ఇతర నిర్మాణ పనులకు అవసరమైన భూముల సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

మరోసారి ట్రిలియనీర్‌గా మస్క్

ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన

Updated Date - Oct 07 , 2026 | 02:19 PM