Share News

ఈ నెల 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. తెరపైకి పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ బిల్లులు?

ABN , Publish Date - Nov 26 , 2026 | 08:31 PM

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. లోక్‌సభను ఈ నెల (నవంబర్) 30న, రాజ్యసభను వచ్చే నెల (డిసెంబర్) 3న సమావేశపరచాలని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌ను కేంద్రం కోరింది.

ఈ నెల 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. తెరపైకి పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ బిల్లులు?
Parliament of India (File Photo)

ఇంటర్నెట్ డెస్క్: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. లోక్‌సభను ఈ నెల (నవంబర్) 30న, రాజ్యసభను వచ్చే నెల (డిసెంబర్) 3న సమావేశపరచాలని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌ను కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ సమావేశాలు డిసెంబర్ మూడో తేదీ వరకు ఉంటాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ అత్యవసర కార్యకలాపాల కోసం ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుల ఆమోదం దిశగా బీజేపీ కసరత్తులు చేస్తోందనే ఊహాగానాల నడుమ కిరణ్ రిజిజు ఈ ప్రకటన చేశారు.


అయితే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల వివరాలను కిరణ్ రిజిజు వెల్లడించలేదు. అయినప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసమే కేంద్రం ఈ సమావేశాలను ప్రారంభించబోతోందని సమాచారం. కాగా మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు-2026ను ఏప్రిల్ 17న కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే అవసరమైన మద్దతును కూడగట్టడంలో కేంద్రం విఫలం కావడంతో ఆ బిల్లు వీగిపోయింది. దీంతో ఈ ప్రతిపాదనలను మరోసారి పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.


ఈ వార్తలూ చదవండి

రాహుల్ గాంధీ ఫొటో పెడితే బ్లాక్ చేస్తున్నారు.. మెటాపై కోర్టుకెక్కిన కాంగ్రెస్..

25 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు.. సమాజ్‌వాది పార్టీ మేనిఫెస్టో విడుదల

Updated Date - Nov 26 , 2026 | 08:31 PM