ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో 62.5 శాతం పోలింగ్.. కందుకూరులో అత్యధికం, శ్రీకాకుళంలో అత్యల్పం
ABN , Publish Date - Nov 26 , 2026 | 07:13 PM
రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల పోలింగ్‌లో గురువారం సాయంత్రం 5 గంటల వరకు 62.5 శాతం ఓటింగ్ నమోదయిందని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) వెల్లడించింది.
విజయవాడ, నవంబర్ 26: రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల పోలింగ్‌లో గురువారం సాయంత్రం 5 గంటల వరకు 62.5 శాతం ఓటింగ్ నమోదయిందని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) వెల్లడించింది. ఈ 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 24,98,312 మంది ఓటర్లకుగాను 15,61,531 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించింది.
రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా ప్రకాశం జిల్లా కందుకూరులో 76.07 శాతం పోలింగ్ నమోదయింది.
మార్కాపురం జిల్లా పొదిలిలో 75.68 శాతం, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 75.13 శాతం చొప్పున భారీ ఓటింగ్ నమోదయింది.
అత్యల్పంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 53.93 శాతం పోలింగ్ నమోదు
నెల్లూరు జిల్లా గూడూరులో 54.28 శాతం, కృష్ణా జిల్లా తాడిగడపలో 55.81 శాతానికి ఓటింగ్ పరిమితమైంది.
నగరపాలక సంస్థల వారీగా పోలింగ్ సరళి..
మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో 72.62 శాతం పోలింగ్.. 2,37,712 ఓట్లకుగాను 1,72,632 ఓట్లు పోలయ్యాయి.
కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 57.64 శాతం పోలింగ్.. 2,85,950 ఓట్లకు గాను 1,64,834 ఓట్లు పోలయ్యాయి.
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో 56.61 శాతం పోలింగ్.. 4,63,323 ఓట్లకుగాను 2,62,265 ఓట్లు పోలయ్యాయి.
శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 53.93 శాతం పోలింగ్.. 1,57,545 ఓట్లకు గాను 84,969 ఓట్లు పోలయ్యాయి.
23 పట్టణ స్థానిక సంస్థల వారీగా పోలింగ్ శాతం..
ప్రకాశం జిల్లా కందుకూరు: 76.07 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 47,473, పోలైన ఓట్లు: 36,113)
మార్కాపురం జిల్లా పొదిలి: 75.68 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 29,697, పోలైన ఓట్లు: 22,476)
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస: 75.13 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 33,067, పోలైన ఓట్లు: 24,843)
గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి: 72.62 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 2,37,712, పోలైన ఓట్లు: 1,72,632)
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు: 68.83 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 77,478, పోలైన ఓట్లు: 53,328)
బాపట్ల జిల్లా బాపట్ల: 68.64 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 74,809, పోలైన ఓట్లు: 51,350)
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట: 68.15 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 23,368, పోలైన ఓట్లు: 15,926)
పల్నాడు జిల్లా నరసరావుపేట: 67.55 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 1,07,622, పోలైన ఓట్లు: 72,699)
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి: 66.87 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 85,433, పోలైన ఓట్లు: 57,126)
గుంటూరు జిల్లా పొన్నూరు: 66.75 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 60,200, పోలైన ఓట్లు: 40,182)
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి: 66.55 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 72,684, పోలైన ఓట్లు: 48,374)
ఏలూరు జిల్లా చింతలపూడి: 66.02 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 22,738, పోలైన ఓట్లు: 15,012)
కృష్ణా జిల్లా గుడివాడ: 64.83 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 1,19,594, పోలైన ఓట్లు: 77,534)
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం: 64.73 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 1,00,728, పోలైన ఓట్లు: 65,202)
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు: 63.88 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 75,465, పోలైన ఓట్లు: 48,208)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం: 62.62 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 1,45,738, పోలైన ఓట్లు: 91,260)
విజయనగరం జిల్లా రాజాం: 62.32 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 36,787, పోలైన ఓట్లు: 22,924)
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు: 60.68 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 21,833, పోలైన ఓట్లు: 13,249)
కాకినాడ జిల్లా కాకినాడ: 57.64 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 2,85,950, పోలైన ఓట్లు: 1,64,834)
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం: 56.61 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 4,63,323, పోలైన ఓట్లు: 2,62,265)
కృష్ణా జిల్లా తాడిగడప: 55.81 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 1,38,576, పోలైన ఓట్లు: 77,334)
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు: 54.28 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 80,492, పోలైన ఓట్లు: 43,691)
శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం: 53.93 శాతం పోలింగ్ (మొత్తం ఓటర్లు: 1,57,545, పోలైన ఓట్లు: 84,969)
ఇవి కూడా చదవండి..
ఏపీలో పంటల బీమా దరఖాస్తులు 2.3 రెట్లు పెరిగాయి.. రైతులకు అచ్చెన్నాయుడు కీలక సూచన
రాత్రి.. లేటుగా నిద్రపోతున్నారా..? అయితే ఈ అవయవాలపై ఎఫెక్ట్ పడ్డట్లే..
Read Latest AP News And Telugu News