Share News

రాహుల్ గాంధీ ఫొటో పెడితే బ్లాక్ చేస్తున్నారు.. మెటాపై కోర్టుకెక్కిన కాంగ్రెస్..

ABN , Publish Date - Nov 26 , 2026 | 07:26 PM

సోషల్ మీడియా దిగ్గజ సంస్థ మెటాతో కాంగ్రెస్ పార్టీ వివాదం మరింత ముదిరింది. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాహుల్ గాంధీ పేరుతో లేదా ఆయన ఫొటోలతో పెట్టే పోస్టులను మెటా సంస్థ ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

రాహుల్ గాంధీ ఫొటో పెడితే బ్లాక్ చేస్తున్నారు.. మెటాపై కోర్టుకెక్కిన కాంగ్రెస్..
Meta Content Moderation

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా దిగ్గజ సంస్థ మెటాతో కాంగ్రెస్ పార్టీ వివాదం మరింత ముదిరింది. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాహుల్ గాంధీ పేరుతో లేదా ఆయన ఫొటోలతో పెట్టే పోస్టులను మెటా సంస్థ ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే మెటా కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేశారు. తాజాగా మెటాపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది (Congress vs Meta).


మెటాతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. రాజకీయ భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకునేలా నిబంధనలు ఉన్నాయని ఆరోపించింది. కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పేరుతో, ఆయన ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాటిని మెటా ఆటోమేటిక్ విధానంలో గుర్తించి బ్లాక్ చేస్తోందని పిటిషన్‌లో పేర్కొంది. పుట్టినరోజు శుభాకాంక్షలు, నివాళులు, పెళ్లి ఆహ్వాన పత్రిక వంటి సాధారణ పోస్టులు కూడా తొలగింపునకు గురయ్యాయని కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేసింది (Meta Content Moderation).


కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2026లో సమాచార సాంకేతిక నిబంధనలను సవరించడం వల్లే ఇలా జరుగుతోందని కాంగ్రెస్ పేర్కొంది (Facebook Content Blocking). ఈ నిబంధనలను రద్దు చేయాలని, తొలగించిన పోస్టులను పునరుద్ధరించాలని, కంటెంట్‌ను పరిమితం చేయడానికి ఉపయోగిస్తున్న ప్రమాణాలను వెల్లడించాలని కోర్టును కోరింది. కాగా, నవంబరు 20 నుంచి ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పలు నగరాల్లో మెటా కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టారు. హైదరాబాద్, ముంబై, గురుగ్రామ్‌లలో ఆందోళనలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి కార్యాలయం వద్ద జరిగిన నిరసన సందర్భంగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

అమెరికాను వదిలేయాలి లేదా ఉద్యోగం మానేయాలి.. హెచ్-1బీ ఉద్యోగులకు ఐబీఎం షాక్..


అమితాబ్ ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. ముంబైలో మరిన్ని ప్రాంతాలకు హెచ్చరిక..

Updated Date - Nov 26 , 2026 | 07:27 PM