అమితాబ్ ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. ముంబైలో మరిన్ని ప్రాంతాలకు హెచ్చరిక..
ABN , Publish Date - Nov 26 , 2026 | 02:51 PM
ముంబైలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసం 'జల్సా'కు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసం 'జల్సా'కు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. అలాగే ముంబై మేయర్ కార్యాలయం, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కార్యాలయం పేర్లను తాజా బెదిరింపు ఈమెయిల్‌లో ప్రస్తావించారు. నవంబర్ 26న ముంబై పౌర సంస్థకు ఈ బెదిరింపు సందేశం ఈ మెయిల్ ద్వారా అందింది (Jalsa Bomb Threat).
నగరంలోని కీలక ప్రాంతాల్లో పేలుళ్లు జరగవచ్చని ఈమెయిల్‌లో హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముంబైలోని కొన్ని మెట్రో స్టేషన్లలో కూడా పేలుళ్లు జరగవచ్చని కూడా ఈమెయిల్‌లో హెచ్చరించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 31 మధ్య దాడులు జరిగే అవకాశం ఉందని సందేశంలో పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాకుండా నగరంలో వచ్చే 30 రోజుల పాటు గ్రెనేడ్ దాడులు జరగవచ్చని కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ బెదిరింపు సందేశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు (Mumbai Bomb Threat).
ఇటీవల కూడా అమితాబ్ నివాసం 'జల్సా'కు బాంబు బెదిరింపు సందేశాలు వచ్చాయి (Amitabh Bachchan House). గత రెండు నెలల్లో అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపు రావడం ఇది మూడోసారి. తాజాగా ముంబై మేయర్ రీతూ తావ్డే, మున్సిపల్ కమిషనర్ అశ్విని భిడేలకు సంబంధించిన కార్యాలయాలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఇవి కూడా చదవండి...
‘ఐటీ కంపెనీల పనివేళలు మార్చాలి’.. సైబరాబాద్ ట్రాఫిక్‌పై డీజీపీ సీవీ ఆనంద్
ప్రైవేట్ స్కూల్లో సిద్దిపేట జిల్లా సైన్స్ ఫేర్.. ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం