Share News

సోనియాగాంధీకి మళ్లీ అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

ABN , Publish Date - May 13 , 2026 | 11:05 AM

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ బుధవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గుర్‌గ్రామ్‌లోని ఆసుపత్రికి ఆమెను తరలించారు.

సోనియాగాంధీకి మళ్లీ అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

న్యూఢిల్లీ, మే13: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురుగ్రామ్‌లోని వేదాంత ఆసుపత్రికి ఆమెను తరలించారు. సోనియాగాంధీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆమె వెంట కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఇటీవల సోనియాగాంధీ తరచూ అస్వస్థతకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి, మార్చి మాసాల్లో ఆమె తీవ్ర ఆరోగ్యానికి గురయ్యారు.


దీంతో సోనియాను వెంటనే ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజులపాటు చికిత్స అనంతరం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మరికొన్ని సమయాల్లో స్వల్ప అస్వస్థతకు గురైతే.. ఆమెకు ఇంటి వద్దే వైద్యులు చికిత్స అందించిన విషయం విదితమే. ప్రస్తుతం సోనియాగాంధీ రాజ్యసభ సభ్యురాలిగా.. పార్టీ పార్లమెంటరీ బోర్డు చైర్ పర్సన్‌గా ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

సరిచేయండి చిన్న బాస్‌..!

హైదరాబాద్‌లో బండి భగీరథ్ పరారీ అంటూ పోస్టర్లు

Read Latest National News And Telugu News

Updated Date - May 13 , 2026 | 01:50 PM