హైదరాబాద్‌లో బండి భగీరథ్ పరారీ అంటూ పోస్టర్లు
ABN , Publish Date - May 13 , 2026 | 09:52 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అబ్స్కాండింగ్ అంటూ హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని, ఆచూకీ తెలిస్తే పోలీస్ స్టేషన్‌లో తెలియజేయండి అంటూ పోస్టర్లలో ఉంది.
హైదరాబాద్, మే 13: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు అవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో బండి భగీరథ్ అబ్స్కాండింగ్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో ‘బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు. ఆచూకీ తెలిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో తెలియజేయండి’ అని రాసి ఉంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బండి భగీరథ్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని.. అతడు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. భగీరథ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తనపై లైంగిక దాడి చేశాడంటూ భగీరథ్‌పై బాలిక ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్‌గా స్పందిస్తూ.. తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. దీంతో ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్న సిట్.. భగీరథ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు తనకు ముందుస్తు బెయిల్ ఇవ్వాలంటూ భగీరథ్.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇవి కూడా చదవండి...
ప్రధాని మోదీ పొదుపు చర్యలు.. కాన్వాయ్‌లో కార్ల సంఖ్య కుదింపు?
అస్సాం సీఎం ప్రమాణస్వీకారానికి చంద్రబాబు, లోకేశ్ హాజరు
Read Latest Telangana News And Telugu News