సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన (యూబీటీ)
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:55 AM
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయంపై సుప్రీంకోర్టును ఉద్ధవ్ వర్గం ఆశ్రయించింది. షిండే వర్గంలో ఆరుగురు లోక్‌సభ ఎంపీల విలీనానికి లోక్‌సభ స్పీకర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ఢిల్లీ, జులై 21 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయంపై సుప్రీంకోర్టును (Supreme Court) ఉద్ధవ్ వర్గం ఆశ్రయించింది. షిండే వర్గంలో ఆరుగురు లోక్‌సభ ఎంపీల విలీనానికి లోక్‌సభ స్పీకర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్‌ను ఉద్ధవ్ ఠాక్రే వర్గం వేసింది. ఉద్ధవ్ వర్గం పిటిషన్‌ను విచారించేందుకు సమ్మతిని పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం వెల్లడించింది.
ఈ విలీనాన్ని ఆమోదిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఉద్ధవ్ వర్గం విజ్ఞప్తి చేసింది. లోక్‌సభ వర్షాకాల సమావేశాలకు ముందే ఎంపీల విలీనానికి స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. ఎంపీల విలీనంతో లోక్‌సభలో 13 మందికి షిండే వర్గం శివసేన బలం పెరిగింది. కేవలం మూడు స్థానాలకు ఉద్ధవ్ ఠాక్రే (UBT) పార్టీ ఎంపీల సంఖ్య పడిపోయింది. ఎవరికి వ్యతిరేకంగా గెలిచారో వారితోనే విలీనమవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో ఉద్ధవ్ వర్గం వాదనలు వినిపించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలి: ప్రధాని మోదీ
సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్.. ఎమ్మెల్యేల అలర్ట్
పామాయిల్ ధర పెంపునకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది: భట్టి విక్రమార్క
Read Latest AP News And Telangana News And National News
And Telugu News