విద్యార్థులు మళ్లీ ప్రశ్నించకుండా కుట్ర జరుగుతోంది.. రాహుల్
ABN , Publish Date - Oct 17 , 2026 | 06:20 PM
ప్రజాస్వామ్యం కోసం గొంతెత్తిన విద్యార్థినులపై ఢిల్లీ పోలీసుల దౌర్జన్యం సిగ్గుచేటని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అంతకుముందు విద్యార్థులతో ఆయన మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియోను ఎక్స్లో రాహుల్ పోస్ట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రజాస్వామ్యం కోసం గొంతెత్తిన విద్యార్థినులపై ఢిల్లీ పోలీసుల దౌర్జన్యం సిగ్గుచేటని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అంతకుముందు విద్యార్థులతో ఆయన మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియోను ఎక్స్లో రాహుల్ పోస్ట్ చేశారు. తమపై పోలీసులు లైంగిక దాడికి పాల్పడ్డారని, దుస్తులు లాగడం, ప్రైవేట్ భాగాలను తాకడం వంటివి చేశారని బాధిత విద్యార్థినులు తనకు చెప్పారని రాహుల్ తెలిపారు. వారితో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్యం కోసం గొంతెత్తిన విద్యార్థినులు, మహిళలపై ఢిల్లీ పోలీసుల దాడులు సిగ్గుచేటు. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు కుట్ర జరుగుతోంది. విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసి మరోసారి ప్రశ్నించకుండా చేయడమే లక్ష్యంగా పోలీసులు దాడులు చేస్తు్న్నట్లు ఉంది. అధికారం కోల్పోయిన రోజు తమ ఇష్టారాజ్యానికి తెరపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలుసు. మోదీ, షా భయం పోలీసుల చర్యల్లో హింసగా ప్రతిబింబిస్తోంది. దేశ యువత, మహిళలపై పోలీసుల హింస ప్రజాస్వామ్యానికి ముప్పు’ అని రాహుల్ పేర్కొన్నారు.
ఈ వార్తలూ చదవండి
రాజస్థాన్లో ఘోర ప్రమాదం.. మినీ బస్సు ప్రమాదంలో 8 మంది మృతి..
ప్రపంచ ఆకలి సూచీలో భారత్కు 100వ స్థానం