Share News

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఢిల్లీ కోర్టు షరతులతో బెయిల్

ABN , Publish Date - Oct 17 , 2026 | 05:28 PM

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఢిల్లీ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు రూ.50,000 పూచీకత్తుతో షరతులతో బెయిల్ మంజూరు చేసింది.

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఢిల్లీ కోర్టు షరతులతో బెయిల్
Abhijeet Dipke Gets Conditional Bail in Delhi

Abhijeet Dipke bail: CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ (SEM) కోర్టు షరతులతో కూడిన పూచీకత్తు బెయిల్ (Conditional Bail) మంజూరు చేసింది. కోర్టు నిబంధనల ప్రకారం ఆయనను రూ. 50,000 ముందస్తు వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఒక సంవత్సరం పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించనని బాండ్ సమర్పించాలని ఆదేశించింది.

ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా తిరంగా మార్చ్ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తు ముందస్తు అరెస్టు కింద పోలీసులు అభిజీత్ దీప్కేను కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. బెయిల్ పత్రాలు, బాండ్‌పై సంతకం ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయనను విడుదల చేశారు.

తాజా సమాచారం ప్రకారం, బెయిల్ మంజూరైన తర్వాత అభిజీత్ దీప్కే మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయన NCP-SCP ప్రతినిధి అనిశ్ గవాండే నివాసానికి చేరుకున్నారు.

కాగా, దీప్కే ముందస్తు అరెస్టును నిరసిస్తూ పలువురు విపక్ష నేతలు (తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ తదితరులు) కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు ఢిల్లీలో వర్తకులు పండుగల వేళ ఆందోళనల వల్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి

ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 17 , 2026 | 05:28 PM