కృతి సనన్ పక్షాన రాహుల్ గాంధీ.. మహిళలపై ట్రోల్స్ ఆపాలంటూ హితవు
ABN , Publish Date - Aug 26 , 2026 | 10:07 AM
నటి కృతి సనన్ ఓ రక్షా బంధన్ యాడ్‌లో ధరించిన దుస్తులపై జరుగుతున్న వివాదాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. మహిళలకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉందని చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: రక్షా బంధన్‌కు సంబంధించిన యాడ్‌లో నటి కృతి సనన్ ధరించిన దుస్తులపై వివాదం నెలకొన్న నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇష్ట ప్రకారం నచ్చిన దుస్తులను ధరించే పూర్తి స్వతంత్రం మహిళలకు ఉందని రాహుల్ స్పష్టం చేశారు. తమ స్వేచ్ఛను వినియోగించుకున్నందుకు స్త్రీలను ట్రోల్ చేయొద్దని చెప్పారు. ‘పితృస్వామ్యాన్ని నిర్మూలించండి’ అని ఆయన ప్రత్యేక ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు.
ఇంకెప్పుడు మారతారు?
కృతి సనన్ సంప్రదాయేతర దుస్తులతో రాఖీ యాడ్‌లో నటించారని నెట్టింట వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కృతి స్పందిస్తూ మహిళలకు ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడం ఇంకెప్పుడు మానుతారని ప్రశ్నించారు. వేసుకున్న బట్టలను బట్టి గౌరవాన్ని నిర్ణయించడం తప్పని చెప్పారు. ‘పండుగనేది భావోద్వేగాలకు సంబంధించినది. దానికి దుస్తులతో సంబంధం లేదు. సంస్కృతి సంప్రదాయాలు గుండెల్లో ఉంటాయి. బట్టల్లో కాదు’ అని కృతి సనన్ పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి...
ఢిల్లీలో 2,308 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు
జగన్ హయాంలో వెలిగొండ నిర్వాసితులను మోసం, దగా చేశారు: మంత్రి నిమ్మల
Read Latest National News And Telugu News