Share News

‘ఓబీసీ క్రీమీలేయర్‌’పై ప్రత్యేక ధర్మాసనం

ABN , Publish Date - Aug 26 , 2026 | 06:49 AM

‘సివిల్‌ సర్వీసుల పరీక్షలు(సీఎ్‌సఈ)-2025’ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ‘ఓబీసీ క్రీమీలేయర్‌’ వర్తింపుపై...

‘ఓబీసీ క్రీమీలేయర్‌’పై ప్రత్యేక ధర్మాసనం

సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ వెల్లడి

మార్చి 11 నాటి తీర్పుపై స్పష్టత కోరిన కేంద్రం

సివిల్స్‌-2025 అభ్యర్థుల సర్వీస్‌ కేటాయింపులకు అనుమతి ఇవ్వాలని వినతి

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ‘సివిల్‌ సర్వీసుల పరీక్షలు(సీఎ్‌సఈ)-2025’ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ‘ఓబీసీ క్రీమీలేయర్‌’ వర్తింపుపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది మార్చి 11న ఇచ్చిన తీర్పుపై స్పష్టత ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణకు త్వరలోనే ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్‌ వి.మోహనల ధర్మాసనం మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 11న వెలువరించిన తీర్పునకు ముందే సివిల్స్‌-2025 ఎంపిక ప్రక్రియ ముగిసిందని, ఫలితాల ఆధారంగా ఎంపికైన 958 మంది అభ్యర్థులకు పాత నిబంధనల మేరకే సర్వీస్‌ కేటాయింపులు పూర్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. మార్చి 11 నాటి తీర్పును యథాతథంగా అమలు చేస్తే అభ్యర్థుల మధ్య అసమానతలు తలెత్తుతాయని తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!

Updated Date - Aug 26 , 2026 | 06:49 AM