Share News

తెహల్కా మాజీ ఎడిటర్‌ తేజ్‌పాల్‌కు సుప్రీం ఆదేశం

ABN , Publish Date - Aug 26 , 2026 | 07:04 AM

అత్యాచారం కేసులో జైలు శిక్ష పడినందున రెండు వారాల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని తెహల్కా మ్యాగజైన్‌ మాజీ ఎడిటర్‌...

తెహల్కా మాజీ ఎడిటర్‌ తేజ్‌పాల్‌కు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ, ఆగస్టు 25: అత్యాచారం కేసులో జైలు శిక్ష పడినందున రెండు వారాల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని తెహల్కా మ్యాగజైన్‌ మాజీ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌(62)ను మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజకీయ కారణాలతో కేసు పెట్టారని, తాను రాజకీయ బాధితుడినని అందువల్ల లొంగుబాటు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన చేసిన వినతిని తిరస్కరించింది. 2013లో గోవాలోని ఓ హోటల్‌లో ఆ మ్యాగజైన్‌కు సంబంధించిన సమావేశంలో పాల్గొనేందుకు లిఫ్ట్‌లో వెళ్తున్న జూనియర్‌ మహిళా ఉద్యోగినిపై లిఫ్ట్‌లోనే రేప్‌ చేసినట్టు ఆయనపై కేసు నమోదయింది. ఆ కేసును ట్రయల్‌ కోర్టు కొట్టివేయగా గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టులో అప్పీలు చేసింది. హైకోర్టు పదేళ్ల కఠిన కారాగారశిక్ష విధించింది. దానిని కొట్టివేయాలని కోరుతూ తేజ్‌పాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!

Updated Date - Aug 26 , 2026 | 07:05 AM